Home News ఇంటింటికీ మొక్కలు…!

ఇంటింటికీ మొక్కలు…!

81
0

ఇంటింటికీ మొక్క–వార్డు వార్డుకూ పచ్చదనం’

– వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలి

Google search engine

– తాండూరులో ఘనంగా మొక్కల పంపిణీ కార్యక్రమం

తాండూరు జనవాహిని ప్రతినిధి : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, వనమహోత్సవంలో భాగంగా తాండూరు మున్సిపాలిటీలోని ప్రతి ఇల్లూ పచ్చదనంతో వికసించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజబాల్ రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవంలో భాగంగా.. పట్టణంలోని 14, 15, 16, 17 వార్డుల్లో స్థానిక కౌన్సిలర్లు, మైప్మా సంయుక్త ఆధ్వర్యంలో గురువారం మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైర్‌పర్సన్ నీరజబాల్ రెడ్డి కాలనీవాసులకు మొక్కలను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కేవలం మొక్కలు నాటడమే కాకుండా, అవి పెరిగి పెద్దదయ్యే వరకు సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ ఒక కర్తవ్యంగా స్వీకరించాలని కోరారు.పట్టణాన్ని పచ్చని తాండూరుగా మార్చడమే మా లక్ష్యంమని, వార్డుల్లోని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని,ప్రజలు కూడా ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ మొక్కల పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్‌ సంబంధిత వార్డుల కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు కాలనీ మహిళలు, యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here