కరీంనగర్ జనవాహిణి బ్యూరో చిట్యాలబాబు :- తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ (టిజిపిఏ) అధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు అంబాల ప్రభాకర్(ప్రభు)మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని హోమ్ గార్డుల పరిస్థితి దయనీయంగా తయారైందనీ,పోలీస్ శాఖలో విధి నిర్వహణలో నీతి నిజాయితీ,నిబద్ధతతో 24 గంటలకు ఉన్నతాధికారులతో మర్యాదగా ఉంటు పని చేసే వారికి జీతాలు సరిగా సకాలంలో ఇవ్వక పోవడంతో ఇంటి అద్దె కిరాయిలు,పిల్లల స్కూల్ ఫీజులు,బ్యాంకులలో,ఫైనాన్స్ లలో తీసుకున్న నెల కీస్తిలు కట్టలేక,కుటుంబ పోషణ దయనీయంగా తయారైందనీ వారికి ఉద్యోగ భద్రత చేస్తామనీ నాటి తెలంగాణ ప్రభుత్వం తెలుపగా నేటి వరకు కూడా అమలు చేయాలేదని,ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారి సమస్యలను గుర్తించి,వారికి ఉద్యోగ భద్రత,ఐదు సంవత్సరాలు సర్వీస్ పూర్తి అయిన హోం గార్డు నుండి కానిస్టేబుల్ ప్రమోషన్ చేయాలని,వివిధ కారణాలతో వారి వీధుల నుండి తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.హోం గార్డు ఉద్యోగులకు వేరే చోటుకు డ్యూటి వేసినప్పుడు ఫ్రీ బస్ పాస్ ఇవ్వాలని కోరారు.అదే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్,సంవత్సరానికి రెండు జతలు యూనిఫాం ఇవ్వాల్సింది ఉండగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.చనిపోయిన హోమ్ గార్డ్ ఉద్యోగుల కుటుంబాలకు వెంటనే ఉద్యోగం ఇవ్వాలని,ఐదు సంత్సరాల నుండి యూనిఫాం అలవేన్స్ రాలేదని హోంగార్డు ల న్యాయమైన డిమాండ్ లను వెంటనే స్పందించి నెరవేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,తెలంగాణ డి జి పి లకు విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో టి జి పి ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడిసె పవన్ కుమార్,రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు రాష్ట్ర నిజ నిర్ధారణ కమిటీ కన్వీనర్,ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ఇంఛార్జీ దార మధు,పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు సిలుముల సంజీవ్,రాజన్నసిరిసిల్ల జిల్లా ప్రధానకార్యదర్శి కొండి సత్యం,కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు సందుపట్ల మల్లేశం లు పాల్గోన్నారు.