ఈ వీకెండ్ థియేటర్స్ లోనే కాదు ఓటీటీల్లోనూ సినీ లవర్స్ ని ఆకట్టుకునే సినిమాలు,వెబ్ సిరీస్ లు సందడి చేయబోతున్నాయి. డిసెంబర్ 22 థియేటర్స్ లో మూడు పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రభాస్ నటించిన ‘సలార్’ ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేయబోతోంది. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు బాలీవుడ్ నుంచి షారుక్ ఖాన్ ‘డంకీ’, హాలీవుడ్ నుంచి ‘ఆక్వామెన్ 2’ పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాయి. అంటే ఈ వీకెండ్ వార్ గట్టిగానే ఉండనుంది. వీటిలో విజయం దేనికనేది కొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది. ప్రభాస్, షారుక్ మధ్య బాక్సాఫీస్ ఫైట్ జరగబోతోంది. ఇప్పటికే రెండు సినిమాలు అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకుపోతున్నాయి.
మరోవైపు ఓటీటీల్లోనూ బోలెడన్ని సినిమాలు రిలీజ్ అవ్వతున్నాయి. ఈ శుక్రవారం ఏకంగా 30కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్లు ఓటీటీలో సందడి చేయబోతున్నాయి. వీటిలో ‘ఆదికేశవ’, ‘సప్త సాగరాలు దాటి – సైడ్ బి’, ‘ఫలిమి’ వంటి సినిమాలకు మంచి వ్యూస్ వచ్చే అవకాశాలున్నాయి. వీటితోపాటు పలు హిందీ, ఇంగ్లీష్ సిరీస్ లు కూడా ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
అమెజాన్ ప్రైమ్
మిషన్ స్టార్ట్ Ab (హిందీ సిరీస్) – డిసెంబరు 19
ద ఏసెస్ (ఇండోనేసియన్ మూవీ) – డిసెంబరు 21
సప్త సాగరాలు దాటి సైడ్-బి (తెలుగు డబ్బింగ్ మూవీ) – డిసెంబరు 22
సాల్ట్ బర్న్ (ఇంగ్లీష్ చిత్రం) – డిసెంబరు 22
డ్రై డే (హిందీ సినిమా) – డిసెంబరు 22
నెట్ ఫ్లిక్స్
ద రోప్ కార్స్ 3 మాండరిన్ మూవీ (డిసెంబర్ 18)
హలో గోస్ట్ మాండరీన్ మూవీ (డిసెంబర్ 18)
ద టేమింగ్ ఆఫ్ ష్రూడ్ 2 (పోలిష్ సినిమా – డిసెంబరు 20)
సిండీ లా రెజీనా: ద హై స్కూల్ ఇయర్స్ (స్పానిష్ సిరీస్ – డిసెంబరు 20)
మ్యాస్ట్రో మూవీ (డిసెంబరు 20)
లైక్ ఫ్లవర్స్ ఇన్ సాండ్ (కొరియన్ సిరీస్ – డిసెంబరు 21)
అల్హమర్ H.A (అరబిక్ మూవీ – డిసెంబరు 21)
రెబల్ మూన్ పార్ట్ 1: ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్ (ఇంగ్లీష్ మూవీ – డిసెంబరు 21)
ఆదికేశవ (డిసెంబరు 22)
కుయికో (తమిళ మూవీ – డిసెంబరు 22)
కర్రీ & సైనైడ్: ద జాలీ జోసెఫ్ కేస్ (వెబ్ సిరీస్ – డిసెంబరు 22)
పింక్ ఫాంగ్ సింగ్-అలాంగ్ మూవీ 3: క్యాచ్ ద జింజర్ బ్రెడ్ మ్యాన్ (డిసెంబరు 24)
ఏ వ్యాంపైర్ ఇన్ ద ఫ్యామిలీ (పోర్చుగీస్ మూవీ – డిసెంబరు 24)
హాట్ స్టార్
ఫలిమి మూవీ (తెలుగు డబ్బింగ్ – డిసెంబరు 18)
పెర్సీ జాక్సన్ అండ్ ఒలింపియన్స్ (వెబ్ సీరిస్ – డిసెంబరు 20)
BTS మాన్యుమెంట్స్: బియాండ్ ద స్టార్ (కొరియన్ సిరీస్ – డిసెంబరు 20)
డ్రాగన్స్ ఆఫ్ వాండర్ హ్యాచ్ (జపనీస్ సిరీస్ – డిసెంబరు 20)
జియో సినిమా
బార్బీ (డిసెంబరు 21)
హే కమీని (డిసెంబరు 22)
జీ5
హోమోరస్లీ యూవర్స్: సీజన్ 3 (సిరీస్ – డిసెంబరు 22)
అడి (మలయాళం – డిసెంబరు 22)
లయన్స్ గేట్ ప్లే
ఫియర్ ద నైట్ (డిసెంబరు 22)
బుక్ మై షో
ద మిరాకిల్ క్లబ్ (డిసెంబరు 19)