శైలేంద్ర ఆవేశం…

మ‌హేంద్ర వెళ్లిపోగానే ఆవేశం ప‌ట్ట‌లేక మ‌నుకు ఫోన్ చేస్తాడు శైలేంద్ర‌. మ‌ను లిఫ్ట్ చేయ‌గానే..ఏం ప్లాన్స్‌రా…ఏం న‌ట‌న రా…మీవి భ‌లే రాజ‌కీయాలు అంటూ మ‌నుపై సెటైర్స్‌వేస్తాడు శైలేంద్ర‌. శైలేంద్ర దేని గురించి మాట్లాడుతున్నాడో తెలియ‌క మ‌ను క‌న్ఫ్యూజ్ అవుతాడు. క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అన్ని నువ్వే రచించి ఏం తెలియ‌న‌ట్లు భ‌లే నాట‌కాలు ఆడుతున్నావ‌ని మ‌నుపై కొప్ప‌డుతాడు. అత‌డి మాట‌ల‌ను భ‌రించ‌లేక మ‌ను ఫోన్ క‌ట్ చేస్తాడు.