ఏపీలో అత్యంత రాజకీయ పోటీ ఉన్న లోక్ సభ నియోజకవర్గం విశాఖపట్నం. రాష్ట్రానికి ఆర్థిక రాజధాని కావటంతోపాటు ప్రధాన పార్టీలు పట్టు సాధించాలనుకునే లోక్ సభ సెగ్మెంట్. గతంలో చూస్తే ఈ లోక్ సభ సీటుకు చాలాసార్లు నాన్‌లోకల్‌ లీడర్లు పోటీపడే వారు. అయితే ఈ ఉక్కు నగరంలో తొలిసారి ఇద్దరు స్థానికులు పోటీ పడుతున్నారు. ఆ ఇద్దరు కూడా బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న వారే కావడంతో అందరి దృష్టీ ఆకర్షిస్తోంది విశాఖ.