Siddharth – Aditi Rao Hydari Marriage: హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావ్ హైదరి సుమారు మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరు డేటింగ్‍లో ఉన్నారంటూ చాలాసార్లు రూమర్లు వచ్చాయి. ఇద్దరూ కలిసి చాలా పార్టీలకు, వెకేషన్లకు వెళ్లారు. కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే, లవ్‍లో ఉన్నామని సిద్ధార్థ్, అదితి నేరుగా చెప్పలేదు. పరోక్షంగా సిగ్నల్స్ ఇస్తూ వచ్చారు. అయితే, వీరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారన్న సమాచారం తాజాగా బయటికి వచ్చింది.