1. ఫస్ డే మిమల్ని హైదరాబాద్ లో పిక్ అప్ చేసుకుంటారు. హైదరాబాద్ లోని పలు సందర్శన ప్రాంతాలను చూపిస్తారు. ఇందులో చార్మినార్, సలార్ జంగ్ మ్యూజియం, లుంబినీ పార్క్ ఉంటాయి. ఆ తర్వాత హోటల్ కు వెళ్తారు. రాత్రి హైదరాబాద్ లోనే బస చేస్తారు.
  2. ఇక సెకండ్ డే ఉదయం 5 గంటలకు శ్రీశైలం వెళ్తారు. మల్లిఖార్డున స్వామి దర్శనం ఉంటుంది. సాయంత్రం వరకు హైదరాబాద్ తిరిగి చేరుకుంటారు.
  3. మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత,,, బిర్లా మందిర్ వెళ్తారు. ఆ తర్వాత గొల్కోండ ఖిల్లాను చూస్తారు. మధ్యాహ్నం అంబేడ్కర్ విగ్రహం చూస్తారు. రాత్రి హైదరాబాద్ లోనే బస చేస్తారు.
  4. 4వ రోజు ఉదయం యాదాద్రికి వెళ్తారు. సురేంద్రపురిని కూడా సందర్శిస్తారు. సాయంత్రం హైదరాబాద్ కు చేరుకుంటారు. దీంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

శ్రీశైలం టూర్ ప్యాకేజీ ధరల వివరాలు:

IRCTC Hyderabad Srisailam Tour Prices: హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ టూరిజం ప్యాకేజీ(IRCTC Hyderabad Srisailam Tour2024) ధరలను చూస్తే…. సింగిల్ షేరింగ్ కు రూ. 37200గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 19530, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 14880గా నిర్ణయించారు. ఐదు నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. ఈ టూరిజం ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాలంటే… https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ప్యాకేజీలో భోజన వసతితో పాటు మరికొన్ని సదుపాయాలు ఉంటాయి. ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 / 8287932228 మొబైల్ నెంబర్లను సంప్రదించవచ్చు.