హాట్‌స్టార్ లేటెస్ట్ రిలీజెస్

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఈ మధ్యకాలంలో కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ రిలీజయ్యాయి. తమిళ సినిమా లవర్, మలయాళ సూపర్ హిట్ మూవీస్ అబ్రహం ఓజ్లర్, నేరు.. తెలుగు కామెడీ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్, మంగళవారం, ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్ లాంటివి హాట్‌స్టార్ లో ఉన్నాయి. ఇప్పుడీ సినిమాలకు సైరన్ కూడా తోడవనుంది. ఏప్రిల్లో సైరన్ తోపాటు మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్ హాట్‌స్టార్ లోకి రానున్నాయి.