అరేబియా సముద్రంలో సోమాలియా దొంగల చేతిలో హైజాక్ కు గురైన MV రూయెన్ అనే వాణిజ్య ఓడను భారత నౌకాదళం సాహసోపేతంగా కాపాడింది. ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా, ఐఎన్‌ఎస్‌ సుభద్రలతోపాటు సీ గార్డియన్‌ డ్రోన్ల సహాయంతో ఆపరేషన్ సక్సెస్ చేశారు. ఆపరేషన్ లో భాగంగా భారత వాయుసేన తన సీ-17 రవాణా విమానం ద్వారా రెండు చిన్న పాటి యుద్ధ బోట్లను కచ్చితమైన ప్లేస్ లో జారవిడిచింది. మెరైన్ కమెండోలు కిందికి దిగి సముద్రపు దొంగల ఆట కట్టించారు. అలాగే బందీలను విడిపించారు. దీనిపై ఆ దేశ అధ్యక్షుడు రామన్ రాదేవ్ ప్రధాని మోదీకి, మన దేశ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.