కవిత అరెస్ట్

BRS MLC Kavitha Arrest Live Updates: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది ఈడీ. శుక్రవారం రాత్రే ఢిల్లీకి తీసుకెళ్లింది. ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనుంది. లైవ్ అప్డేట్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేయండి……

Sat, 16 Mar 202404:44 AM IST

కేజ్రీవాల్ కు బెయిల్

ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు ముందుస్తు బెయిల్ మంజూరైంది.

Sat, 16 Mar 202404:44 AM IST

సుప్రీంకు కవిత

తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ కవిత… సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ పిటిషన్ వేసే అవకాశం ఉంది.

Sat, 16 Mar 202404:26 AM IST

కాసేపట్లో కోర్టుకు……

వైద్య పరీక్షలు పూర్తి అయిన నేపథ్యంలో కాసేపట్లో కవితను కోర్టులో హాజరుపర్చనున్నారు.

Sat, 16 Mar 202404:25 AM IST

వైద్య పరీక్షలు పూర్తి

కవితకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. శనివారం ఉదయం ఈడీ కేంద్ర కార్యాలయం పరివర్తన్‌ భవన్‌కు వెళ్లిన మహిళా డాక్టర్ల బృందం మెడికల్ పరీక్షలను పూర్తి చేశారు.

Sat, 16 Mar 202404:23 AM IST

కవిత పిటిషన్ పై విచారణ వాయిదా

కవిత పిటిషన్ పై మార్చి 15వ తేదీన విచారించిన సుప్రీంకోర్టు…. మార్చి 19వ తేదీకి విచారణ వాయిదా పడింది. ఇదిలా ఉండగానే…. ఈడీ అధికారులు….. కవితను మార్చి 15వ తేదీన అరెస్ట్ చేశారు. మార్చి 16వ తేదీ ఢిల్లీలెని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. ఆ తర్వాత కస్టడీకి కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.

Sat, 16 Mar 202404:22 AM IST

సుప్రీంలో కవిత పిటిషన్

మరోవైపు గతేడాదే ఈ కేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. దీంతో లిక్కర్ కేసు కీలక మలుపు తిరిగింది. మహిళల విచారణలో సీఆర్పీసీ నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ ఈ పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు… తుది ఆదేశాలు వచ్చే వరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు కొద్ది నెలలుగా వాదనలు కొనసాగుతున్నాయి.

Sat, 16 Mar 202404:22 AM IST

అప్రూవర్లుగా నిందితులు

ఇదిలా ఉండగానే ఈ కేసులోని నిందితులుగా ఉన్న పలువురు అప్రూవర్లుగా మారారు. దీంతో దర్యాప్తు సంస్థలకు కీలక సమాచారం అందింది. దీని ఆధారంగా దూకుడు పెంచే పనిలో పడ్డాయి సీబీఐ, ఈడీ. ఈ సమాచారం ఆధారంగానే కవితకు ఇటీవలే కూడా నోటీసులు పంపాయి. అంతేకాదు కేసులో సాక్షిగా ఉన్న కవితను నిందితురాలిగా కూడా పేర్కొంది సీబీఐ. 41 సీఆర్పీసీ కింద నోటీసులు కూడా ఇచ్చింది.

Sat, 16 Mar 202404:21 AM IST

కవితను విచారించిన సీబీఐ

ఈ కేసులో కవిత పాత్ర ఉన్నట్లు గుర్తించిన ఈడీ, సీబీఐ పలుమార్లు నోటీసులను జారీ చేసింది. విచారణకు రావాలని ఆదేశించింది. 2022 డిసెంబర్ లో హైదరాబాద్ లో ని కవిత నివాసానికి వచ్చిన సీబీఐ అధికారులు… కవితను విచారించారు. దాదాపు 7 గంటలపాటు కవితను విచారించారు. సౌత్ గ్రూప్ కంట్రోలర్ గా మీరు ఉన్నారా?మీరు ఫోన్లు మార్చారా?సౌత్ గ్రూప్ గురించి మీకు తెలుసా? అందులో మీ పాత్ర ఉందా? వంటి పలు ప్రశ్నలను సీబీఐ సంధించినట్లు తెలిసింది. ఆ తర్వాత ఈడీ నుంచి కూడా నోటీసులు వచ్చాయి. స్వయంగా ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో విచారణకు కూడా హాజరయ్యారు కవిత. ఈ సమయంలోనే కవితను అరెస్ట్ చేస్తారన్న వార్తలు వచ్చాయి. కానీ అరెస్ట్ కాలేదు.

Sat, 16 Mar 202404:21 AM IST

అమిత్ ఆరోరో అరెస్ట్ – రిమాండ్ రిపోర్టులో కవిత పేరు

ఈ కేసులో అమిత్ ఆరోరోనా అరెస్ట్ చేసింది సీబీఐ. అయితే మద్యం పాలసీ రూపకల్పనలో ప్రైవేటు వ్యక్తులు ఉన్నారని విషయాన్ని సీబీఐ గుర్తించింది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో తొలిసారిగా కవిత పేరును ప్రస్తావించింది సీబీఐ. ఆ తర్వాత ఈ కేసులోకి ఈడీ(ED) కూడా ఎంట్రీ ఇచ్చింది. వంద కోట్ల రూపాయల ముడుపులను సౌత్ గ్రూప్(South Group) చెల్లించినట్లు సీబీఐ తేల్చింది. సౌత్ గ్రూప్ ను నియంత్రించింది శరత్ రెడ్డి, కవిత, వైసీపీ ఎంపీ మాగుంట అని ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూప్ ద్వారా వంద కోట్లను విజయ్ నాయర్ కు చేర్చినట్టుగా ఈడీ(ED) వెల్లడించింది. 36 మంది రూ.1.38 కోట్ల విలువైన 170 మెుబైల్ ఫోన్లు ధ్వంసం చేశారని తెలిపింది. వీటిలో కవిత రెండు నెంబర్లు, పది మెుబైల్ ఫోన్ల్(Mobile Phones) వాటినట్టుగా పేర్కొంది. కవిత వాడిన పది ఫోన్లు ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేశారని ఈడీ రిమాండ్ రిపోర్టులో తెలిపింది.

Sat, 16 Mar 202404:20 AM IST

నిన్న రాత్రే ఢిల్లీకి తరలింపు

  • నిన్న త్రి 8 గంటల తర్వాత శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు కవిత.
  • రాత్రి 08.45 నిమిషాలకు ఈడీ బుక్ చేసిన ఫైట్ లో ఢిల్లీకి తరలించారు.
  • ఇవాళ ఢిల్లీలోని రౌజ్ రెవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టనుంది ఈడీ.
  • కవితను ఢిల్లీకి తరలించిన నేపథ్యంలో… కేటీఆర్ తో పాటు పలువురు నేతలు శుక్రవారం రాత్రే ఢిల్లీకి బయల్దేరారు. సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది.

Sat, 16 Mar 202404:20 AM IST

కవిత అరెస్ట్ పై ఈడీ ప్రకటన

  • PMLA(Prevention of Money Laundering Act) యాక్ట్‌ సెక్షన్‌ 19 కింద అరెస్ట్‌ చేసినట్లు ఈడీ తెలిపింది.
  • సాయంత్రం 6 గంటలకు 20 మంది అనుమతి లేకుండా లోపలికి వచ్చి తమతో వాగ్వాదానికి దిగారని ఈడీ పేర్కొంది.
  • ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ పేరుతో కవిత అరెస్ట్ కు సంబంధించి ప్రకటన విడుదలైంది.
  • అరెస్ట్‌ చేయడానికి గల కారణాలతో కూడిన 14 పేజీల కాపీని కవితకు అందజేసినట్లు ఈడీ తెలిపింది.

Sat, 16 Mar 202404:20 AM IST

నిన్న సాయంత్రం కవిత అరెస్ట్

  • మార్చి 15వ తేదీన 12 మందితో కూడా ఈడీ అధికారుల బృందం హైదరాబాద్ కు చేరుకుంది.
  • శుక్రవారం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ బంజారాహిల్స్ ని కవిత నివాసానికి చేరుకుంది.
  • కవిత నివాసంలో సోదాలు చేపట్టింది. మధ్యాహ్నం 1.45 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సోదాలు జరిగినట్లు ఈడీ ఓ ప్రకటన విడుదల చేసింది.
  • కవిత నివాసానికి ఎమ్మెల్యేలు హరీశ్ రావు, కేటీఆర్ చేరుకున్నారు. వారితో పాటు అడ్వొకేట్ సోమ భరత్ కూడా ఉన్నారు.
  • తొలుత వీరిని ఇంట్లోకి వెళ్లేందుకు ఈడీ అధికారులు అనుమతించలేదు. ఆ తర్వాత లోపలికి వెళ్లినట్లు తెలిసింది. ట్రాన్సిట్‌ వారెంట్‌ లేకుండా ఎలా అరెస్ట్‌ చేస్తారంటూ అధికారులను కేటీఆర్ ప్రశ్నించారు.
  • శుక్రవారం సాయంత్రం 5.20 గంటలకు కవితను అరెస్ట్‌ చేసినట్లు ఈడీ వెల్లడించింది.

Sat, 16 Mar 202404:19 AM IST

గతంలో నోటీసులు, విచారణ

  • ఈ కేసుకు సంబంధిచి నోటీసులు అందుకున్నారు కవిత. 2022 డిసెంబర్ లో హైదరాబాద్ లో ని కవిత నివాసానికి సీబీఐ అధికారుల బృందం వచ్చింది… కవితను దాదాపు 7 గంటలపాటు కవితను విచారించారు.
  • ఆ తర్వాత ఈడీ(ED) నుంచి కూడా నోటీసులు వచ్చాయి. స్వయంగా ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో విచారణకు(2023 మార్చి 11) కూడా హాజరయ్యారు కవిత. ఈ సమయంలోనే కవితను అరెస్ట్ చేస్తారన్న వార్తలు వచ్చాయి. కానీ అరెస్ట్ కాలేదు.
  • 2023లో మహిళల విచారణలో ఈడీ సీఆర్పీసీ నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై కొద్ది నెలలుగా విచారణ జరుగుతోంది.
  • కేసు విచారణ సాగుతుండగానే… మరోవైపు సీబీఐ, ఈడీ మరోసారి కవితకు నోటీసులు పంపాయి. ఈ కేసులో సాక్షిగా ఉన్న కవితను నిందితురాలిగా కూడా పేర్కొంది సీబీఐ. ఇటీవలే 41 సీఆర్పీసీ కింద నోటీసులు కూడా ఇచ్చింది. కానీ సీబీఐ విచారణకు హాజరుకాలేదు కవిత.

Sat, 16 Mar 202404:18 AM IST

2022లో వెలుగులోకి

-ఢిల్లీ లిక్కర్ కేసు(Delhi Liquor Scam Case) వ్యవహారం 2022లో వెలుగులోకి వచ్చింది.

-2021లో ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ(Delhi Liquor Scam Case)లో అవకతవకలు జరిగాయని.. దీనిపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి.

-ఈ కేసును మొదటగా సీబీఐ విచారణ జరపగా… ఆ తర్వాత ఈడీ ఎంట్రీ ఇచ్చింది.

ఈ కేసులో 2002లో అమిత్ ఆరోరోనా అరెస్ట్ చేసింది సీబీఐ. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో తొలిసారిగా కవిత పేరును ప్రస్తావించింది సీబీఐ. ఫోన్ల ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేశారని పేర్కొంది.

Sat, 16 Mar 202404:13 AM IST

బీఆర్ఎస్ న్యాయపోరాటం

కవిత అరెస్ట్ ను సవాల్ చేస్తూ న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది బీఆర్ఎస్. ఇప్పటికే కేటీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. న్యాయవాదులతో మంతనాలు జరుపుతున్నారు.

Sat, 16 Mar 202404:12 AM IST

కాసేపట్లో వైద్య పరీక్షలు

ఎమ్మె‍ల్సీ కవితకు కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

Sat, 16 Mar 202404:11 AM IST

ఉదయం 10.30 గంటలకు

ఇవాళ ఉదయం 10.30 గంటలకు రౌజ్ అవెన్యూ కోర్టు ముందు కవితను ప్రవేశపెట్టనుంది ఈడీ. ఈరోజు కవితను తమ కస్టడీకి ఇవ్వాలని కోరనుంది.

Sat, 16 Mar 202404:05 AM IST

కవిత అరెస్ట్…

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది ఈడీ. శుక్రవారం రాత్రే ఢిల్లీకి తీసుకెళ్లింది. ఇవాళ రౌజ్ రెవెన్యూ కోర్టులో హాజరుపర్చనుంది.