హోండా ఎలివేట్ ధర

హోండా కార్స్ ఇండియా ఇటీవల విడుదల చేసిన ఎలివేట్ (Honda Elevate) కాంపాక్ట్ ఎస్ యూవీ ధరలను గరిష్టంగా రూ.58,000 వరకు పెంచింది. హోండా ఎలివేట్ గత సంవత్సరం ప్రవేశపెట్టిన తరువాత ధరను పెంచడం ఇదే మొదటిసారి. ఈ పెంపు అనంతరం, కొత్త ప్రారంభ ధర రూ .11.58 లక్షలు, టాప్-స్పెక్ డ్యూయల్-టోన్ వేరియంట్ ధర రూ .16.48 లక్షలకు చేరుకుంది. ఇవి క్స్-షోరూమ్, ఢిల్లీ ధరలు. పెర్ల్ కలర్ ఆప్షన్ పై అదనంగా రూ.8,000 చెల్లించాల్సి ఉంటుంది. కొత్త సంవత్సరానికి ధరలను పెంచుతూ 2023 డిసెంబర్లో హోండా తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ధరల పెంపు జరిగింది. ఎలివేట్ ధర వేరియంట్ ను బట్టి రూ .11 లక్షల నుండి రూ .16 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది 20,000 యూనిట్ల అమ్మకాల మైలురాయిని ఇప్పటికే అధిగమించింది.