రెండో జాబితాలో టికెట్ రాకుంటే నా దారి నేను చూసుకుంటా – సోయం బాపూరావు

ఇదిలా ఉంటే మరోవైపు నాగర్ కర్నూల్(Nagar Kurnool) ఎంపీ టికెట్ ఆశించిన బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శృతి కూడా బీజేపీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కాగా ఇటీవలే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు భరత్ కుమార్ కు నాగర్ కర్నూల్ టికెట్ కేటాయించడంతో బంగారు శృతి నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన బీబీ పాటిల్(BB Patil) కు టికెట్ ఇవ్వగా…..ఆ స్థానంపై ఆశలు పెట్టుకున్న ఆలే నరేంద్ర కుమారుడు ఆలే భాస్కర్, మాజీ మంత్రి బాగా రెడ్డి కుమారుడు జయపాల్ రెడ్డి తీవ్ర నిరాశతో ఉన్నారు. ఇటు మొదటి జాబితాలో తమ పేర్లు రాకపోవడంతో మహబూబ్ నగర్ టికెట్ ఆశించిన డీకే అరుణ(DK Aruna), మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సైతం ఆందోళనలో ఉన్నారట. ఇకపోతే ఆదిలాబాద్(Adilabad) స్థానంపై బీజేపీ అధిష్ఠానం తొలి జాబితాలో ఎవరి పేరు ప్రకటించుకోవడంతో సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు(Soyam Bapuram) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు టికెట్ రాకుండా కొందరు నేతలు అడ్డుపడ్డారని, ఆదివాసీ బిడ్డ రెండోసారి గెలిస్తే ఎక్కడ కేంద్రమంత్రి అవుతాడో అని భయంతో తనకు టిక్కెట్ రాకుండా కొందరు బీజేపీ తెలంగాణ నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు. తాను కొమ్మపై ఆధారపడ్డొడిని కాదని స్వతహాగా ఎదిగిన వ్యక్తిని అని అన్నారు. రెండో జాబితాలో టిక్కెట్ వస్తుందని తాను భావిస్తున్నట్లు ఒకవేళ రాకపోతే తన దారి తాను చూసుకుంటా అని అన్నారు.