ప్రయోజనాలు

పీఎం-సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన (PM-Surya Ghar Muft Bijli Yojana – PM-SGMBY) ద్వారా ఇంటిపై రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ ను అమర్చుకోవడం ద్వారా సౌరశక్తి ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేసి, ఆ విద్యుత్ ను గృహావసరాలకు వినియోగించుకోవచ్చు. తద్వారా విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చు. అంతేకాదు, మిగులు సౌర విద్యుత్ ను డిస్కమ్ లకు విక్రయించడం ద్వారా అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఈ విధానంలో రూఫ్ టాప్ సోలార్ ద్వారా అదనంగా 30 గిగావాట్ల సౌర విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చు. వీటి వల్ల కాలుష్యకారక కార్బన్ డయాక్సైడ్ (CO2) ఉద్గారాలు తగ్గుతాయి. మరోవైపు, పీఎం-సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా ప్రొడక్షన్, లాజిస్టిక్స్, సప్లై చైన్, సేల్స్, ఇన్ స్టలేషన్, ఆపరేషన్స్ అండ్ మేనేజ్ మెంట్, ఇతర సేవల్లో 17 లక్షల ఉద్యోగాలు లభిస్తాయి.