పోలియో రహిత సమాజమే లక్ష్యం..!
తాండూరు మున్సిపాలిటీలో పల్స్ పోలియో కార్యక్రమం 26వ వార్డులో పోలియో చుక్కలు వేసిన కౌన్సిలర్ వైశాలి రాజు గౌడ్ జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ పరిధిలోని 26వ వార్డులో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని స్థానిక వార్డు కౌన్సిలర్ వైశాలి రాజు గౌడ్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రానికి వచ్చిన పలువురు చిన్నారులకు ఆమె స్వయంగా పోలియో చుక్కలు వేశారు.అనంతరం కౌన్సిలర్ వైశాలి రాజు గౌడ్ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు అయిన చిన్నారుల ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ...
చిన్నారులకు రక్షణ కవచం 'పల్స్ పోలియో
సీతారాంపేట్ 19వ వార్డులో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ వెంకటేష్ జుంటుపల్లి జనవాహిని ప్రతినిధి తాండూరు : దేశాన్ని పోలియో రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం ఆదివారం పట్టణంలో నిర్వహించారు. తాండూరు మున్సిపల్ పరిధిలోని సీతారాంపేట్ 19వ వార్డు కౌన్సిలర్ వెంకటేష్ జుంటుపల్లి ఆధ్వర్యంలో బృందావన్ కాలనీ మరియు స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసి చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ వెంకటేష్...
రేపే విగ్రహ ప్రతిష్ఠాపన...!
ఘనపూర్ శివరామ దుర్గా క్షేత్ర మహోత్సవానికి తరలిరానున్న భక్తులు నేడు విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన పూజలు పాల్గొననున్న ఆర్బిఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి జనవాహిని ప్రతినిధి పరిగి :- పరిగి మండల పరిధిలోని ఘనపూర్ గ్రామంలో వెలసిన శ్రీ శివరామ దుర్గా క్షేత్రం విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి సిద్ధమైంది. క్షేత్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ శివలింగం, శ్రీ దుర్గాదేవి, శ్రీ సీతారామ లక్ష్మణ, శ్రీ ఆంజనేయ, శ్రీ దత్తాత్రేయ, నవగ్రహాల మరియు నాగదేవతల ధ్వజస్తంభ, విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు అత్యంత...
దళారీ వ్యవస్థకు చెక్..!
రూపాయి ఖర్చు లేకుండా పేదవాడి ఇంటి కల నిజం చేస్తున్న ప్రజా ప్రభుత్వం గతంలో సంక్షేమ పథకాలు నాయకులకు ఆదాయ మార్గాలుగా మారాయి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు మున్సిపాలిటీలో డ్రా పద్ధతి ద్వారా 581 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ఎంపిక జనవాహిని ప్రతినిధి తాండూరు : గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కొందరు నాయకులకు కమీషన్లు తెచ్చిపెట్టే ఆదాయ మార్గాలుగా మారితే.. నేటి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రూపాయి అవినీతికి తావులేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తోంది అని...
ఇంటింటికీ 'సార్' నోటీసుల పంపిణీ
ముమ్మరంగా సాగిన కార్యక్రమం పాల్గొన్న కౌన్సిలర్ వెంకటేష్ జుంటుపల్లి, బీఎల్ఓ రాములు జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని సీతారాంపేట్ 19వ వార్డులో 'సార్' నోటీసుల పంపిణీ కార్యక్రమం శనివారం ముమ్మరంగా సాగింది. వార్డు కౌన్సిలర్ వెంకటేష్ జుంటుపల్లి ఆధ్వర్యంలో నాయకులు, అధికారులు ప్రతి ఇంటికీ తిరుగుతూ ఈ నోటీసులను, ఫారాలను ప్రజలకు అందజేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ వెంకటేష్ జుంటుపల్లి మాట్లాడుతూ.. వార్డు పరిధిలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ సమాచారం చేరాలనే ఉద్దేశంతో ఈ ఇంటింటి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు....
లబ్ధిదారుల ఎంపిక పేరిట ‘డబుల్’ డ్రామా..!
ఆసుపత్రి తరలింపు వివాదాన్ని డైవర్ట్ చేసేందుకే ఈ ఎత్తుగడ వార్డుల్లో సర్వేలు చేయకుండానే ఇళ్ల లిస్టులు సిద్ధం బీఆర్‌ఎస్ కౌన్సిలర్ రూపా రుద్రూ పాటిల్ ఆరోపణలు జనవాహిని ప్రతినిధి తాండూరు : ప్రజలను మభ్యపెట్టేందుకే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పేరిట నాటకాలు ఆడుతున్నారని తాండూరు మున్సిపాలిటీ 36వ వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ రూపా రుద్రూ పాటిల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే, జిల్లా అధికారుల సమక్షంలో నిర్వహించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ‘డ్రా’ పద్ధతి...
ఎల్పీ లిస్ట్ లో టౌన్ ప్రెసిడెంట్ పేరు..!
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లిస్ట్‌లో కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ పేరు.. ప్రజా ప్రతినిధి హోదాలో ఉండి కూడా పేదల ఇళ్లకు దరఖాస్తు చేయడమేంటి? ఎలాంటి సర్వే లేకుండానే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై మండిపాటు. జనవాహిని ప్రతినిధి తాండూరు :ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో అధికార పార్టీ నేతల చేతివాటం ప్రదర్శిస్తున్నారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. లబ్ధిదారుల అర్హుల జాబితా లో కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ బాతుల నాగు మరియు ఆయన భార్య పేరు ఉండడంపై...
కౌన్సిలర్ భార్యకు 'డబుల్' ఇళ్ళు..!
తాండూరులో లబ్ధిదారుల ఎంపికపై వెల్లువెత్తిన విమర్శలు ప్రజాప్రతినిధికి సొంత భవనం ఉన్నా దరఖాస్తు చేయడమేంటి? మండిపడుతున్న స్థానికులు, పేదలు జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది. అర్హులైన పేదలకు దక్కాల్సిన ఇళ్ల జాబితాలో ఏకంగా అధికార మున్సిపల్ కౌన్సిలర్ భార్య పేరు వెలుగులోకి రావడం స్థానికంగా సంచలనంగా మారింది.శనివారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో అధికారుల ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను నిర్వహించారు....
ఘనాపూర్‌లో ఆధ్యాత్మిక సంబరం...!
ఘనాపూర్‌లో వైభవంగా శ్రీ శివరామ దుర్గా క్షేత్ర విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు ముఖ్య అతిథిగా ఆర్.బి.ఎల్. సిఇఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఈ నెల 29 వరకు కొనసాగనున్న ఆధ్యాత్మిక వేడుకలు జనవాహిని ప్రతినిధి వికారాబాద్ : మండల పరిధిలోని ఘనాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శివరామ దుర్గా క్షేత్రంలో విగ్రహ ప్రతిష్ఠాపన, ధ్వజ స్తంభ ప్రతిష్ఠా మహోత్సవాలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 27 నుండి 29 సోమవారం వరకు మూడు రోజుల పాటు ఈ వేడుకలు...
రేపే ఇళ్ల పంపిణి...!
అర్హులైన నిరుపేదలకు రేపే ‘డబుల్’ ఇండ్ల పంపిణీ తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాట్లు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగు జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన నిరుపేదలకు శుక్రవారం డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను పంపిణీ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగు ఒక ప్రకటనలో తెలిపారు. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఈ పంపిణీ కార్యక్రమం వైభవంగా జరగనుందని పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేల ముఖ్య సమక్షంలో, వారి ఆధ్వర్యంలో ఈ ఇండ్ల కేటాయింపు ప్రక్రియ...












