HomeNewsఎమ్మెల్యేపై కేసు..? అంతా బీఆర్ఎస్ డ్రామా!

ఎమ్మెల్యేపై కేసు..? అంతా బీఆర్ఎస్ డ్రామా!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై కుట్రపూరితంగానే ప్రైవేట్ కేసులు
  •  బీఆర్ఎస్ ‘కౌంటర్ బ్లాస్ట్’ వ్యూహం బయటపడింది
  •  పోలీసులపై దాడి చేసి తప్పించుకోవడానికే తప్పుడు ఫిర్యాదుల
  •  అభివృద్ధిని చూసి ఓర్వలేకే అబద్ధపు ప్రచారం
  •  జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి అడ్వకేట్ కే. గోపాల్

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అభివృద్ధిని అడ్డుకోలేక బీఆర్ఎస్ శ్రేణులు పన్నుతున్న కుట్రలు ప్రజలందరికీ తెలుసని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి అడ్వకేట్ కే. గోపాల్ మండిపడ్డారు. శనివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ, ఎమ్మెల్యేపై కేసు నమోదైందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఓటమి భయంతో బీఆర్ఎస్ నేత రోహిత్ రెడ్డి, ఆయన అనుచరులు కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత సృష్టించారని గోపాల్ గుర్తు చేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై దాడికి యత్నించడమే కాకుండా, అడ్డుకున్న పట్టణ సీఐ మరియు ఇతర పోలీసు సిబ్బందిపై బీఆర్ఎస్ కార్యకర్తలు భౌతిక దాడులకు దిగారని సాక్ష్యాలతో సహా వివరించారు. ఈ ఘటనపై అప్పట్లోనే పోలీసులు నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేశారని తెలిపారు.తమపై ఉన్న తీవ్రమైన కేసుల నుండి తప్పించుకోవడానికే బీఆర్ఎస్ నేతలు కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారని ఆయన విమర్శించారు. ప్రైవేట్ ఫిర్యాదు వస్తే విచారణ జరపాలని కోర్టు ఆదేశించడం సాధారణ ప్రక్రియ. అది కేవలం విచారణ దశ మాత్రమే తప్ప కేసు నమోదు కాదు అని ఆయన వివరించారు. గోబెల్స్ తరహాలో అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసి నిజం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రతిపక్షాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయని, ప్రజా సమస్యలను వదిలేసి కేసులు వేయడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగం, న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని, ఈ రాజకీయ కుట్రలను చట్టపరంగా ఎదుర్కొంటామని గోపాల్ ధీమా వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments