HomeNewsరేపే విగ్రహ ప్రతిష్ఠాపన...!

రేపే విగ్రహ ప్రతిష్ఠాపన…!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • ఘనపూర్ శివరామ దుర్గా క్షేత్ర మహోత్సవానికి తరలిరానున్న భక్తులు
  •  నేడు విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన పూజలు
  •  పాల్గొననున్న ఆర్బిఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి 

జనవాహిని ప్రతినిధి పరిగి :- పరిగి మండల పరిధిలోని ఘనపూర్ గ్రామంలో వెలసిన శ్రీ శివరామ దుర్గా క్షేత్రం విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి సిద్ధమైంది. క్షేత్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ శివలింగం, శ్రీ దుర్గాదేవి, శ్రీ సీతారామ లక్ష్మణ, శ్రీ ఆంజనేయ, శ్రీ దత్తాత్రేయ, నవగ్రహాల మరియు నాగదేవతల ధ్వజస్తంభ, విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం జూన్ 29 న ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, మహా పూర్ణాహుతి నిర్వహించనున్నారు.ఈ పరమ పవిత్ర పూజా కార్యక్రమాల్లో ఆర్ బి ఓ ఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని పురస్కరించుకుని భక్తుల కోసం భారీగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమానికి బుయ్యని శ్రీనివాస్ రెడ్డి గప్రత్యేక సహకారం అందించారు.మహోత్సవంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం నుండి ప్రారంభమయ్యే అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి కుల్కచర్ల మండలంతో పాటు పరిసర గ్రామాల భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆలయ నిర్వాహకులు కోరారు. భక్తులందరూ స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments