― Advertisement ―

దళారీ వ్యవస్థకు చెక్..!

రూపాయి ఖర్చు లేకుండా పేదవాడి ఇంటి కల నిజం చేస్తున్న ప్రజా ప్రభుత్వం గతంలో సంక్షేమ పథకాలు నాయకులకు ఆదాయ మార్గాలుగా మారాయి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు మున్సిపాలిటీలో...
HomeNEWSఇంటింటికీ 'సార్' నోటీసుల పంపిణీ

ఇంటింటికీ ‘సార్’ నోటీసుల పంపిణీ

spot_img
  • ముమ్మరంగా సాగిన కార్యక్రమం
  •  పాల్గొన్న కౌన్సిలర్ వెంకటేష్ జుంటుపల్లి, బీఎల్ఓ రాములు

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని సీతారాంపేట్ 19వ వార్డులో ‘సార్’ నోటీసుల పంపిణీ కార్యక్రమం శనివారం ముమ్మరంగా సాగింది. వార్డు కౌన్సిలర్ వెంకటేష్ జుంటుపల్లి ఆధ్వర్యంలో నాయకులు, అధికారులు ప్రతి ఇంటికీ తిరుగుతూ ఈ నోటీసులను, ఫారాలను ప్రజలకు అందజేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ వెంకటేష్ జుంటుపల్లి మాట్లాడుతూ.. వార్డు పరిధిలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ సమాచారం చేరాలనే ఉద్దేశంతో ఈ ఇంటింటి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. నివాసితులకు అవసరమైన మార్గదర్శకాలను ఈ సందర్భంగా వివరించారు.ఈ కార్యక్రమంలో బీఎల్ఓ రాములు, బీఎల్ఏ సయ్యద్ ఖాజీ, వార్డ్ ఆర్పీ వెంకటలక్ష్మి, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు సమద్ మరియు వార్డుకు చెందిన యువకులు, స్థానికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.