Google search engine
spot_img
spot_img
HomeTelanaganahyderabadఎమ్మెల్యేపై అభిమానం.. సేవా మార్గంలో సంబరం!

ఎమ్మెల్యేపై అభిమానం.. సేవా మార్గంలో సంబరం!

spot_img
spot_img
spot_img
  • ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు
  •  ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన కౌన్సిలర్లు 
  • మొక్కలు నాటి, అన్నదానం, రక్తదానం చేసిన బంటు వేణు, శ్రీకాంత్, ప్రశాంత్ 

జనవాహిని ప్రతినిధి తాండూరు: తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ 11వ వార్డు కౌన్సిలర్ బంటు వేణు, 10వ వార్డ్ కౌన్సిలర్ శ్రీకాంత్, 9వ వార్డ్ నాయకుడు ప్రశాంత్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో పలు సామాజిక, సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ప్రజాభిమాన నాయకుడి పుట్టినరోజును పురస్కరించుకొని రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా పలు చోట్ల సేవా కార్యక్రమాలు చేపట్టారు.వేడుకల్లో భాగంగా కౌన్సిలర్ బంటు వేణు ముందుగా తన నివాసం ప్రాంగణంలో మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా పచ్చదనాన్ని పెంపొందించే దిశగా మొక్క నాటడం శుభపరిణామమని తెలిపారు.అనంతరం పట్టణంలోని ప్రసిద్ధ రక్త మైసమ్మ ఆలయ ప్రాంగణంలో భక్తులకు, పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ కౌన్సిలర్ బంటు వేణు, శ్రీకాంత్, ప్రశాంత్ లు స్వయంగా ప్రజలకు అన్నప్రసాదాలు వితరణ చేశారు.అదేవిదంగా పట్టణంలోని వైట్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్‌లో ఎమ్మెల్యే బర్త్‌డే వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలోనాయకులు పాల్గొని స్వయంగా రక్తదానం చేశారు. ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు యువత, నాయకులు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments