Google search engine
spot_img
spot_img
HomeTelanaganahyderabadహ్యాపీ బర్త్డే మనోహర్ అన్న...!

హ్యాపీ బర్త్డే మనోహర్ అన్న…!

spot_img
spot_img
spot_img
  • ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనం
  •  9వ వార్డులో కేక్ కట్ చేసిన పట్లోళ్ల ప్రశాంత్, నాయకులు
  • శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, వార్డు ప్రజలు

జనవాహిని ప్రతినిధి తాండూరు: తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని 9వ వార్డులో వేడుకలు అత్యంత వైభవంగా, ఉత్సాహపూరిత వాతావరణంలో సాగాయి. వార్డు నాయకుడు పట్లోళ్ల ప్రశాంత్   రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు, అభిమానులు మరియు స్థానిక ప్రజల సమక్షంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ, టపాసులు పేలుస్తూ… శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పట్లోళ్ల ప్రశాంత్  రెడ్డి     మాట్లాడుతూ… తాండూరు ప్రాంత సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా అహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వంలో పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మనోహర్ రెడ్డి మరెన్నో జరుపుకోవాలని, ఉన్నత పదవులు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డ్ కౌన్సిలర్ బంటు వేణు, పట్లోళ్ల రాము,ఇందూర్నరేందర్,రమేష్,జగదీష్,నరేష్ వార్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, మరియు కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments