- దేశ రాజధాని లో కాంగ్రెస్ సీనియర్ నేతలతో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి భేటీ
- పార్టీ సంస్థాగత బలోపేతంపై సుదీర్ఘ చర్చ
- కాంగ్రెస్ చీఫ్ విప్ కొడికున్నిల్ సురేష్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఆర్బిఓఎల్ సీఈఓ
జనవాహిని ప్రతినిధి తాండూరు: కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు, పార్టీ లోక్‌సభ చీఫ్ విప్ కొడికున్నిల్ సురేష్‌ను ఆర్బిఓఎల్ సీఈఓ, కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో ఈ భేటీ జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై ఇరువురు నేతలు ప్రత్యేకంగా చర్చించారు. దేశంలో, రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న సమకాలీన రాజకీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.అనంతరం, కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ చీఫ్ విప్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న కొడికున్నిల్ సురేష్‌ను శ్రీనివాస్ రెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాసేవలో ఆయన మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని, పార్టీ బలోపేతానికి ఆయన మార్గదర్శకత్వం ఎంతో అవసరమని ఆకాంక్షించారు.





