- ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా అజ్మీర్ షరీఫ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు
- కాంగ్రెస్ పార్టీ నాయకులు షైక్ వాసీమ్..!
జనవాహిని ప్రతినిధి తాండూరు: తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదిన సందర్బంగా తాండూరు పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు షైక్ వసీమ్ అజ్మీర్ షరీఫ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదిన సందర్బంగా ఈ సందర్భంగా దర్గాలో పూల చాదర్ సమర్పించి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆయు రారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని, కోరారు. అనంతరం భక్తులకు, నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి, మానవ సేవే మాధవ సేవ అనే భావనతో సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని, ఆయన నాయకత్వంలో తాండూరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రార్థించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి పుట్టిన రోజులు ఆయన మరెన్నో జరుపుకోవాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో దర్గా నిర్వాహకులు, భక్తులు, స్థానికులు పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేశారు.





