Google search engine
spot_img
spot_img
HomeTelanaganahyderabadజిల్లా అధ్యక్షులుగా యూ. రమేష్...!

జిల్లా అధ్యక్షులుగా యూ. రమేష్…!

spot_img
spot_img
spot_img
  • వికారాబాద్, మేడ్చల్, కరీంనగర్ జిల్లాలకు నూతన బిజెపి అధ్యక్షుల నియామకం
  • వికారాబాద్ జిల్లా అధ్యక్షులుగా యూ. రమేష్ కుమార్..!

జనవాహిని ప్రతినిధి తాండూరు: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పలు జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్ రావు నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్. గౌతమ్ రావు మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడిగా  యు. రమేష్, ను నియమించారు. అదేవిదంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడిగా  డి. గిరివర్ధన్ రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా సాయి మల్లేశంలను నియమించినట్లు ఆ ప్రకటనలో తెలిపారు. నూతన వికారాబాద్ జిల్లా అధ్యక్షులుగా యూ. రమేష్ ను నియమించడం తో పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేసాయి. యు.రమేష్‌ కుమార్ గతంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు. గతంలోనే జిల్లా అధ్యక్షులుగా నియామకం కావాల్సి ఉంది. మరోవైపు ఈ మూడు జిల్లాలకు సంబంధించి అధ్యక్షుల నియామకాలపై రాజకీయాలు చోటు చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా దిల్లీలో బండి సంజయ్‌ నివాసానికి ఈటల సహా ఎంపీలు లక్ష్మణ్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వెళ్లారు. వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలో పెండింగ్‌ జిల్లాల అధ్యక్షుల నియామకాలను పార్టీ ప్రకటించింది. జిల్లాల్లో పార్టీ విధివిధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, క్షేత్రస్థాయిలో బిజెపి బలోపేతానికి మరియు ప్రజా సమస్యలపై పోరాటాలకు నూతన అధ్యక్షులు కృషి చేయాలని పార్టీ అధిష్టానం ఈ సందర్భంగా సూచించింది. నూతనంగా ఎంపికైన అధ్యక్షులకు పార్టీ శ్రేణులు, నాయకులు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments