- ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు
- 24వ వార్డులో మొక్కలు నాటిన నాయకులు
- ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్
జనవాహిని ప్రతినిధి తాండూరు: తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మున్సిపల్ పరిధిలో 24వ వార్డులో బుధవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని అత్యంత నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ ముఖ్య అతిథిగా హాజరై, నాయకులతో కలిసి వార్డు ప్రాంగణంలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా కావాలి సంతోష్ మాట్లాడుతూ… నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా సమాజానికి మేలుచేసేలా హరితహారం లాంటి సత్కార్యాన్ని చేపట్టిన కౌన్సిలర్ బాలకృష్ణారెడ్డిని, వార్డు నాయకులను ఈ సందర్భంగా వారు ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమ నిర్వాహకులు, కౌన్సిలర్ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మార్గదర్శకత్వంలో వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాకుండా, పచ్చదనంతో నింపడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేష్ ముదిరాజ్, కాంగ్రెస్ యువ నాయకుడు జోగులా ఎబినైజర్, రఘు పటేల్, రాజశేఖర్ రెడ్డితో పాటు వార్డు యువ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.





