HomeTelanaganahyderabadఆగస్టు 10 వరకే ఛాన్స్..!

ఆగస్టు 10 వరకే ఛాన్స్..!

spot_img
  • ఎస్ఐఆర్ ప్రక్రియ గడువు ఆరు రోజులు పొడిగింపు
  • తాండూర్ పట్టణ ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
  •  తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాతుల నాగు

జనవాహిని ప్రతినిధి తాండూరు:  రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాతుల నాగు తెలిపారు. మంజూరైన ఈ పొడిగింపు అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పౌరులందరూ గడువు ముగిసేలోపే తమ వార్డు పరిధిలోని బిఎల్ఓ లకు ఎనుమరేషన్ ఫారాన్ని పూరించి అందించాలని సూచించారు. ఓటు హక్కు అనేది మనందరి బాధ్యత, ప్రతి ఒక్కరూ తమ ఓటును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని పేర్కొన్నారు.అదేవిధంగా, స్థానిక బిఎల్ఎ లు మరియు బిఎల్ఓ లు సమన్వయంతో పనిచేస్తూ, ప్రజలకు ఈ ప్రక్రియపై సరైన అవగాహన కల్పించాలని, గడువులోగా ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments