HomeNewsAPCPDCL: కొత్త విద్యుత్ కనెక్షన్లపై గుడ్ న్యూస్ -ఇక ఐవీఆర్ఎస్ తోనే..!

APCPDCL: కొత్త విద్యుత్ కనెక్షన్లపై గుడ్ న్యూస్ -ఇక ఐవీఆర్ఎస్ తోనే..!

spot_img

APCPDCL: కొత్త విద్యుత్ కనెక్షన్లపై గుడ్ న్యూస్ -ఇక ఐవీఆర్ఎస్ తోనే..!

ఏపీలో కొత్త విద్యుత్ కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APCPDCL) మరో వినూత్న డిజిటల్ సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. వినియోగదారులకు ఇంటి నుంచే కొత్త విద్యుత్ కనెక్షన్ దరఖాస్తు చేసే సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఐవీఆర్ఎస్ విధానం ద్వారా బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను అధికారులు ఇవాళ విడుదల చేశారు.

సోలార్ పెట్టినా తగ్గని కరెంటు బిల్లు..! 25 వేలు ఇప్పించిన వినియోగదారుల ఫోరం..!
సోలార్ పెట్టినా తగ్గని కరెంటు బిల్లు..! 25 వేలు ఇప్పించిన వినియోగదారుల ఫోరం..!

1912 ఇంటిగ్రేటెడ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (IVRS) ద్వారా కొత్త విద్యుత్ సర్వీస్ కనెక్షన్ (New Service Connection-NSC) దరఖాస్తుల స్వీకరణ సేవను ఏపీసీపీడీసీఎల్ ఛైర్మన్, ఎండీ పి. పుల్లారెడ్డి ఇవాళ ప్రారంభించారు. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ సేవలను పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ దిశగా తీసుకెళ్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే ఫిర్యాదుల నమోదు, సేవలకు సంబంధించిన సమాచారం, వినియోగదారుల సమస్యల పరిష్కారంలో 1912 సేవలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని, ఇప్పుడు అదే వేదిక ద్వారా నూతన విద్యుత్ సర్వీస్ కనెక్షన్ దరఖాస్తులను కూడా స్వీకరించే విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వినియోగదారులకు మరింత సౌలభ్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

APCPDCL launches IVRS booking facility for new electricity connections here s how to apply

Bhogapuram Airport: భోగాపురం క్రెడిట్ వారిదే ? ఆధారాలతో తేల్చేసిన మాజీ ఇంటెల్ ఛీఫ్ ..!
Bhogapuram Airport: భోగాపురం క్రెడిట్ వారిదే ? ఆధారాలతో తేల్చేసిన మాజీ ఇంటెల్ ఛీఫ్ ..!

ఇకపై కొత్త విద్యుత్ కనెక్షన్ అవసరమైన వినియోగదారులు *1912*కు కాల్ చేసి IVRS సూచనలను అనుసరించి తమ దరఖాస్తును నమోదు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు నమోదైన వెంటనే సంబంధిత వివరాలు విద్యుత్ శాఖ అధికారులకు చేరుతాయని, అధికారులు వినియోగదారుని సంప్రదించి అవసరమైన పత్రాల పరిశీలన, సాంకేతిక తనిఖీలు, ఇతర ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత కాలవ్యవధిలో కనెక్షన్ మంజూరు చేసే చర్యలు తీసుకుంటారని వివరించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు, వృద్ధులు, దివ్యాంగులు, ఉద్యోగ రీత్యా కార్యాలయాలకు రావడానికి సమయం లేని వినియోగదారులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని సీఎండీ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments