HomeEntertainmentషూటింగ్‌లో తీవ్రంగా గాయపడిన రష్మిక.!

షూటింగ్‌లో తీవ్రంగా గాయపడిన రష్మిక.!


షూటింగ్‌లో తీవ్రంగా గాయపడిన రష్మిక.!

Jul 31, 2026 6:29PM

టాలీవుడ్ ను వరుస గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే బాలకృష్ణ, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్స్ గాయపడి కోలుకుంటున్నారు. ఇక ఇప్పుడు స్టార్ హీరోయిన్ రష్మిక కూడా గాయపడ్డారు

డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా రష్మిక తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె రణబాలి, మైసా సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. రణబాలి, మైసా చిత్రాల్లో వరుసగా యాక్షన్ సీక్వెన్సులు, డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ లు చేయడం వల్ల రష్మిక హిప్ ఏరియాలో పూర్తిగా టెండన్ డిటాచ్ మెంట్ అయ్యింది. ఆమె గాయం వైద్యులను సైతం షాక్ కు గురి చేసింది. తీవ్రంగా సాధన చేసే క్రీడాకారుల్లో మాత్రమే ఇలాంటి గాయాలు అవుతుంటాయని వైద్యులు చెబుతున్నారు. 

రష్మిక 6 వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. టెండన్ తిరిగి బలపడేందుకు రీహాబిలిటేషన్ కూడా అవసరం అని వైద్యులు తెలిపారు.

ప్రస్తుతం రష్మిక పాన్ ఇండియా స్థాయిలో బిజీయెస్ట్ హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తున్నారు. ఆమె 4 భారీ చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. అలాగే 30 ప్రాడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. రష్మికకు అయిన తీవ్ర గాయంతో ఆయా సినిమాల, వ్యాపార ప్రకటనల షూటింగ్స్ నిలిచిపోనున్నాయి. ఆమె త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్, వెల్ విషర్స్ కోరుకుంటున్నారు.

 

 

Rashmika Mandanna, Ranabaali, Mysaa



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Most Popular

Recent Comments