కోటి జీతం, 3 ఇళ్లు- అయినా రూ.15 వేలు పన్ను కట్టలేక ఐఐటీయన్ ..!
మన దేశంలో ఐఐటీలంటే(IIT) ఓ క్రేజ్. ఐఐటీయన్లు (IITian)అంటే మరీ క్రేజ్. ఐఐటీ పూర్తి చేసుకుని భారీ ప్యాకేజ్ లు ఇచ్చే ఉద్యోగాల్లో చేరిపోవడం లేదా విదేశాలకు వెళ్లిపోవడం, ఇంకా ఆసక్తి ఉంటే స్టార్టప్ లు పెట్టుకుని సంచలనాలు రేపడం చూస్తూనే ఉన్నాం. అయితే ఇలా ఏ విధంగా సెటిల్ అయినా, ఎంత ఐఐటీయన్ అయినా ఆర్ధిక క్రమశిక్షణ లేకపోతే జీవితం ఎలా తలకిందులవుతుందో తెలియజెప్పే ఓ ఉదాహరణ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇందులో ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన ఓ విద్యార్థి, ఆ తర్వాత ఉద్యోగం తెచ్చుకుని ఏడాదికి కోటి రూపాయల జీతం ప్యాకేజీ కూడా తీసుకుంటున్నాడు. అలా మూడు ఇళ్లకు యజమాని కూడా అయ్యాడు. ఇందులో రెండు ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. అయితే ఈ ఏడాది ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసేందుకు తన ఛార్టర్డ్ అకౌంటెంట్ కు వివరాలు సమర్పించిన తర్వాత ఆమె రిటర్న్ ఫైల్ చేసింది. ఆమెకు చెల్లించాచ్సిన ఆదాయపు పన్నులో 15 వేలు తగ్గిందట. దీంతో ఆమెనే బతిమాలుకుని ఎలాగోలా కట్టి బయటపడ్డాడు సదరు ఐఐటీయన్. ఈ వివరాల్ని సదరు ఛార్టర్డ్ అకౌంటెంట్ స్వయంగా ట్వీట్ చేయడంతో వైరల్ అవుతోంది.

Just filed ITR of one of my IITian client!
He is a young guy having package of 1Cr plus since 5 years.
Has 3 houses out of which 2 projects are WIP.
He told me he had no money to pay taxes of Rs. 15K and wanted me to wait till August so that his salary comes and we can pay the…— Pratibha Gupta (@PratibhaGoyal) July 27, 2026
ఐఐటీలో చదువుకున్న తన క్లయింట్ ఒకరి ఐటీ రిటర్న్ ఇప్పుడే ఫైల్ చేశానని, అతను ఒక యువకుడు, గత ఐదేళ్లుగా ఏడాదికి రూ.కోటి పైగా ప్యాకేజీని పొందుతున్నాడని, అతనికి మూడు ఇళ్లు కూడా ఉన్నాయని, అందులో రెండు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయంటూ ప్రతిభా గోయల్ అనే సీఏ ట్వీట్ చేశారు. అయితే రూ. 15 వేల పన్ను చెల్లించడానికి తన దగ్గర డబ్బు లేదని, జీతం వచ్చే వరకు అంటే ఆగస్టు వరకు వేచి ఉండమని అతను తనతో చెప్పాడని ఆమె తెలిపారు. అప్పుడు పన్ను చెల్లించవచ్చని అన్నట్లు పేర్కొన్నారు. గడువు తేదీ తర్వాత పన్ను చెల్లిస్తే అదనపు వడ్డీ భారం పడుతుందని ఆమె తెలిపారు. అలాంటి పరిస్థితిని నివారించడానికి, ఆ క్లయింట్ అప్పు చేసి పన్ను చెల్లించి ITR ఫైల్ చేశారన్నారు. దీనిని బట్టి దేశంలో ఆర్థిక అవగాహన (financial literacy) అవసరాన్ని ఈ ఘటన గుర్తుచేస్తోందని గోయల్ వ్యాఖ్యానించారు.


