HomeJobsIIT Kanpur: హ్యాకథాన్‌లో ఫెయిల్.. వెబ్‌సైట్ హ్యాక్ చేసి సవాల్- ప్రతిభకు తలవంచిన ఐఐటీ.!

IIT Kanpur: హ్యాకథాన్‌లో ఫెయిల్.. వెబ్‌సైట్ హ్యాక్ చేసి సవాల్- ప్రతిభకు తలవంచిన ఐఐటీ.!

IIT Kanpur: హ్యాకథాన్‌లో ఫెయిల్.. వెబ్‌సైట్ హ్యాక్ చేసి సవాల్- ప్రతిభకు తలవంచిన ఐఐటీ.!

మన దేశంలో ఐఐటీ(IIT)లకు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలుగా పేరుంది. వాటిలో చేరేందుకు ప్రతీ ఏటా లక్షల మంది జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో పోటీ పడుతున్నారు. అయితే జేఈఈలో అర్హత సాధించకపోయినా నేరుగా హ్యాకథాన్ ఆధారంగా కొన్ని సీట్లు రిజర్వ్ చేసే ఇచ్చే విధాన్ని కొన్ని ఐఐటీలు అమలు చేస్తున్నాయి. ఇలాంటి వాటిలో ఐఐటీ కాన్పూర్ (IIT Kanpur)కూడా ఒకటి. ఇలా ఐఐటీ కాన్పూర్ నిర్వహించిన ఓ హ్యాకథాన్ లో ఎంపిక కాని ఓ విద్యార్ధి ఏకంగా అదే ఐఐటీ వెబ్ సైట్ హ్యాక్ చేశాడు. దీంతో షాకైన ఐఐటీ వర్గాలు.. అతనిపై చర్యలు తీసుకోవడానికి బదులు హ్యాకథాన్ లో పాల్గొనేందుకు రెండో ఛాన్స్ ఇచ్చారు.

కాక్రోచ్ ల వీడియోలు డిలీట్ చేయండి- విద్యార్ధులకు మరో ఐఐటీ ఆదేశం..!
కాక్రోచ్ ల వీడియోలు డిలీట్ చేయండి- విద్యార్ధులకు మరో ఐఐటీ ఆదేశం..!

ఈ ఏడాది ఐఐటీ కాన్పూర్ బీటెక్ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం నిర్వహించిన హ్యాకథాన్ లో ఓ విద్యార్ధి విఫలమయ్యారు. దీంతో నిరాశ చెందకుండా ఆ విద్యార్థి ఐఐటీ కాన్పూర్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి.. దానిలో “వెబ్ సైట్ హ్యాక్ అయింది, నాకు కావలసిందల్లా ఒక న్యాయమైన అవకాశం మాత్రమే” అనే మెసేజ్ పెట్టాడు. అలాగే దాని స్క్రీన్ షాట్ లు తీసి రెడ్డిట్ తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో పెట్టాడు. ఈ హ్యాక్ తన పనే అని కూడా తెలిపాడు. తనకు ప్రవేశం నిరాకరించిన తర్వాత, కేవలం తన సైబర్‌ సెక్యూరిటీ నైపుణ్యాలను ప్రదర్శించాలనుకున్నానని, ఐఐటి కాన్పూర్ సిస్టమ్‌లను దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని చెప్పుకొచ్చాడు.

Rejected Student Hacks IIT Kanpur Website Wins Second Chance at Hackathon

విదేశాలకు తరలిపోతున్న IIT గ్రాడ్యుయేట్లు..! పార్లమెంట్ లో కేంద్రం షాకింగ్ రీజన్..!
విదేశాలకు తరలిపోతున్న IIT గ్రాడ్యుయేట్లు..! పార్లమెంట్ లో కేంద్రం షాకింగ్ రీజన్..!

సాధారణంగా అయితే ఐఐటీ కాన్పూర్ సదరు విద్యార్ధిపై కేసు నమోదు చేసి జైలుకు పంపే అవకాశం ఉంది. కానీ ఐఐటీ అలా చేయలేదు. వ్యవస్థలను హ్యాక్ చేయడం అవకాశాల కోసం ఆమోదయోగ్యమైన మార్గం కాదని స్పష్టం చేస్తూనే, ఆ విద్యార్థికి తమ సి3ఐహబ్ సైబర్ సెక్యూరిటీ కేంద్రంలో ఇంటర్న్‌షిప్ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఐఐటి కాన్పూర్ డైరెక్టర్ మనీంద్ర అగర్వాల్ వెల్లడించారు. అతను వచ్చే ఏడాది ప్రవేశం కోసం ప్రయత్నించవచ్చని అగర్వాల్ ఇండియా టుడే టీవీకి తెలిపారు. ఈ ఘటన తర్వాత ఐఐటీ కాన్పూర్ ..సైబర్‌ సెక్యూరిటీ టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్ అయిన C3iHubలో ఇంటర్న్‌షిప్ లేదా ఉద్యోగ అవకాశాల కోసం, నైపుణ్యం కలిగిన సైబర్‌ సెక్యూరిటీ ఔత్సాహికులు తమ సీవీలను పంపవచ్చని ప్రకటించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Most Popular

Recent Comments