HomeJobsNEET కౌన్సెలింగ్‌లో భారీ మార్పులు! కాలేజీకి వెళ్లకుండానే సీటు కన్ఫర్మ్..

NEET కౌన్సెలింగ్‌లో భారీ మార్పులు! కాలేజీకి వెళ్లకుండానే సీటు కన్ఫర్మ్..

NEET కౌన్సెలింగ్‌లో భారీ మార్పులు! కాలేజీకి వెళ్లకుండానే సీటు కన్ఫర్మ్..

దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక నీట్ యూజీ (NEET UG) కౌన్సెలింగ్ ద్వారా మెడికల్ సీటు సాధించాలనే లక్ష్యంతో ఉన్న లక్షలాది మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే తీపి కబురు చెప్పింది. ఇప్పటివరకు ప్రతీ రౌండ్ కౌన్సెలింగ్‌లోనూ సీటు మారినప్పుడల్లా కేటాయించిన కళాశాలలకు స్వయంగా వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ తిప్పలు ఉండవు. సీటు అప్‌గ్రేడేషన్ కోసం పదే పదే భౌతికంగా కాలేజీల చుట్టూ తిరిగే అవసరం లేకుండా కౌన్సెలింగ్ నిబంధనలను కేంద్ర ఆరోగ్య శాఖ సంస్కరించింది. ఈ నూతన విధానాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్వయంగా సమీక్షించి ఆమోదం తెలిపారు.

ఒక్కసారే ఫిజికల్ రిపోర్టింగ్

తాజా మార్పుల ప్రకారం.. మొదటి లేదా రెండో రౌండ్ కౌన్సెలింగ్‌లో సీటు సాధించిన విద్యార్థి, అంతకంటే మంచి కాలేజీ కోసం తర్వాతి రౌండ్లలో పోటీ పడాలనుకుంటే ‘ఫ్లోట్’ (Float) ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. దీనివల్ల మొదట వచ్చిన సీటు భద్రంగానే ఉంటుంది. అయితే, దీనికోసం విద్యార్థులు ఆయా కాలేజీలకు ప్రత్యక్షంగా వెళ్లాల్సిన అవసరం లేదు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌లోనే నిర్వహించి ప్రొవిజనల్ అడ్మిషన్ కల్పిస్తారు. ఒకవేళ తర్వాతి రౌండ్‌లో ఇంతకంటే ఉత్తమమైన సీటు లభిస్తే, పాత సీటు స్వయంసిద్ధంగా రద్దయి మరొకరికి కేటాయించబడుతుంది.

NEET UG 2026 Counselling Rules Change Centre Introduces One Time Physical Reporting For Medical Seats

చదువుల వ్యవస్థను చెత్తబుట్టలో వేయండి: విద్యావ్యవస్థపై ఆర్జీవీ బాంబ్!
చదువుల వ్యవస్థను చెత్తబుట్టలో వేయండి: విద్యావ్యవస్థపై ఆర్జీవీ బాంబ్!

ఎప్పుడు కాలేజీకి వెళ్లాలి? ‘ఫ్రీజ్’ విధానం స్పష్టం!

విద్యార్థి తనకు వచ్చిన సీటుతో పూర్తి సంతృప్తి చెంది, తదుపరి రౌండ్లలో పాల్గొనకూడదనుకుంటే ‘ఫ్రీజ్’ ఆప్షన్ ఎంచుకోవాలి. అలాగే మూడో రౌండ్ కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత మాత్రం విద్యార్థులు ఖచ్చితంగా తమకు కేటాయించిన వైద్య కళాశాలకు స్వయంగా వెళ్లాల్సిందే. అక్కడ ఓరిజినల్ డాక్యుమెంట్స్ సమర్పించి, సంబంధిత కోర్సు ఫీజు చెల్లించి తుది అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.

నీట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బిగ్ షాక్- మొదటి విచారణకే సీబీఐ లాయర్లు డుమ్మా
నీట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బిగ్ షాక్- మొదటి విచారణకే సీబీఐ లాయర్లు డుమ్మా

సీటు రద్దు, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లు కూడా ఆన్‌లైన్‌లోనే!

ఇప్పటివరకు తాము సాధించిన సీటును వదులుకోవాలనుకుంటే విద్యార్థులు నేరుగా కాలేజీకే వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) పోర్టల్ ద్వారానే నేరుగా సీటును సరెండర్ చేసే వెసులుబాటు కల్పించారు. దీనితో పాటు ఎన్‌ఆర్‌ఐ (NRI) కోటా కింద ప్రవేశాలు పొందే విద్యార్థుల డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌ను కూడా పూర్తిగా డిజిటలైజ్ చేశారు. గతంలో ఈ పత్రాలను ఈమెయిల్ ద్వారా పంపాల్సి రావడం వల్ల స్ప్యామ్ ఫోల్డర్లలోకి వెళ్లడం లేదా మిస్ అవ్వడం లాంటి సమస్యలు తలెత్తేవి. నూతన సాఫ్ట్‌వేర్ విధానంతో ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం లభించినట్లయింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Most Popular

Recent Comments