HomeNewsరేషన్ కార్డుదారులకు బంపర్ బొనంజా: ఈకేవైసీ గడువు పొడిగింపు, మూడునెలల రేషన్ ఒకేసారి

రేషన్ కార్డుదారులకు బంపర్ బొనంజా: ఈకేవైసీ గడువు పొడిగింపు, మూడునెలల రేషన్ ఒకేసారి

రేషన్ కార్డుదారులకు బంపర్ బొనంజా: ఈకేవైసీ గడువు పొడిగింపు, మూడునెలల రేషన్ ఒకేసారి

హైదరాబాద్ నగరంలో రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. రేషన్ కార్డుకు సంబంధించి ఈ కేవైసీ ప్రక్రియ నేటితో ముగియనున్న క్రమంలో, ఇప్పటికీ ఈ కేవైసీ చేసుకోని వారి కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో కొనసాగుతున్న భారీ వర్షాలు, ప్రత్యేక ఓటర్ జాబితా సవరణను దృష్టిలో పెట్టుకొని రేషన్ ఈకేవైసీ చేసే గడువును మరో నెలపాటు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.

రేషన్ ఈకేవైసీ గడువు పొడిగింపు

ఆగస్టు 31వ తేదీ వరకు లబ్ధిదారులు రేషన్ ఈకేవైసీని పూర్తి చేసుకోవాలి. ఇక ఈ విషయాన్ని చీఫ్ రేషనింగ్ అధికారి రాజిరెడ్డి వెల్లడించారు. ఆగస్టు 31వ తేదీలోగా ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఆయన కీలక సూచన చేశారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులను తగ్గించడం, వేగవంతంగా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం లక్ష్యంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

ration bumper bonanza Hyderabad ration card e-KYC deadline extended three months ration at a time

మూడు నెలల రేషన్ ఒకేసారి

అలాగే రేషన్ పంపిణీ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఆగస్టు 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు లబ్ధిదారులు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి తీసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రతినెల రేషన్ దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒకేసారి మూడు నెలల కోటాను తీసుకువెళ్లే సౌలభ్యం కలిగిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఈ కేవైసీ పూర్తి చేయకపోతే భవిష్యత్తులో నష్టం

రేషన్ కార్డు దారులు తమ సమీపంలోని చౌక ధరల దుకాణాలను సంప్రదించి ఈ కేవైసీ ని పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. అంతేకాదు మూడు నెలల రేషన్ బియ్యాన్ని నిర్ణీత తేదీలలో తప్పకుండా పొందాలని తెలిపారు. ఈ కేవైసీ పూర్తి చేయకపోతే భవిష్యత్తులో నష్టం జరుగుతుందని, రేషన్ ప్రయోజనాలను కోల్పోయే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.

హైదరాబాదీలకు మరో అవకాశం.. ఈకేవైసీ చేస్కోండి

మరోవైపు హైదరాబాదులో లక్షలాది రేషన్ కార్డుదారులకు ఈ నిర్ణయం పెద్ద ఉపశమనం కానుంది. ఇప్పటికి చాలామంది రేషన్ కార్డుదారులు ఈ కేవైసీ పూర్తి చేసుకోని క్రమంలో గడువు పొడిగించడం వారికి అవకాశం కల్పిస్తుంది. లబ్ధిదారులు త్వరితగతిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని త్వరగా ఈ కేవైసీ పూర్తి చేయాలి.

వారందరికీ ఆగస్ట్ 15నుండి కొత్తగా పించన్లు.. సీఎం రేవంత్ రెడ్డి కీలకఆదేశాలు
వారందరికీ ఆగస్ట్ 15నుండి కొత్తగా పించన్లు.. సీఎం రేవంత్ రెడ్డి కీలకఆదేశాలు

ఈకేవైసీ చేయటానికి ఇలా చెయ్యండి

రేషన్ దరఖాస్తుదారులు ఈ కేవైసీ పూర్తి చేయడానికి మీ దగ్గరలోని రేషన్ షాప్ కి వెళ్ళాలి. ఈపాస్ యంత్రం ద్వారా వేలిముద్ర లేదా కంటిపాప స్కాన్ ఇవ్వాలి. మీసేవ కేంద్రాల ద్వారా కూడా ఆధార్ అనుసంధానంతో ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఈ కేవైసీ చేయించుకోవడానికి రేషన్ కార్డు తో పాటు కుటుంబ సభ్యులందరి అసలు ఆధార్ కార్డులు తీసుకువెళ్లాలి ప్రతి కుటుంబంలో ఉన్న ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఈ కేవైసీ చేసుకోవాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Most Popular

Recent Comments