AP Job Calendar 2026: జాబ్ క్యాలెండర్ పై లోకేష్ ప్రకటన- 3168 ఉద్యోగాల భర్తీ..!
ఏపీలో నిరుద్యోగులకు కూటమి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ (AP Job Calendar 2026) విడుదల చేయాలని ఇవాళ నిర్ణయించింది. ‘జాబ్ కేలండర్-2026’పై ఇవాళ మంత్రులతో కలిసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఇందులో జాబ్ క్యాలెండర్ ఎప్పుడు విడుదల చేయబోతున్నారు, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు, ఇతర వివరాలను లోకేష్ మంత్రులకు వెల్లడించారు.
ఈ ఏడాది జాబ్ క్యాలెండర్ ను సెప్టెంబర్ 15న విడుదల చేయాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ నిర్ణయించారు. ఇందులో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల పకడ్బందీగా ఉండాలని ఆయన సూచించారు. ‘జాబ్ కేలండర్-2026’ రెండో దశలో భాగంగా 3,168 ఉద్యోగాల్ని భర్త చేయాలని నిర్ణయించారు. దీనిపై త్వరలో ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. గతేడాది తొలి విడత జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసిన ప్రభుత్వం వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేసింది.

