HomeTelanaganahyderabadయాలల్ వద్దు, టౌన్ కు మార్చండి...!

యాలల్ వద్దు, టౌన్ కు మార్చండి…!

  • పోలీసు అధికారుల రాకకు తీవ్ర ఆలస్యం
  • యాలల్ నుండి టౌన్ కు మార్చండి 
  •  8వ వార్డు కౌన్సిలర్ జావేద్ 
  • వికారాబాద్ జిల్లా ఎస్పీకి వినతి 

జనవాహిని ప్రతినిధి తాండూరు: తాండూర్ మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు రాజీవ్,ఇందిరమ్మ కాలనీలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, రాత్రి వేళల్లో పోలీసు గస్తీ పెంచాలని కోరుతూ స్థానిక కౌన్సిలర్ జావీద్ వికారాబాద్ జిల్లా ఎస్పీకి శుక్రవారం వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ జావీద్ మాట్లాడుతూ… తమ కాలనీ ప్రస్తుతం యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని తెలిపారు. అయితే, యాలల్ పోలీస్ స్టేషన్ కాలనీకి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల ఏదైనా అత్యవసర సంఘటన లేదా దొంగతనం జరిగినప్పుడు అధికారులు ఇక్కడికి చేరుకోవడానికి గంటకు పైగా సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దూరభారం వల్ల కాలనీలో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున, ప్రజా భద్రత దృష్ట్యా పోలీసులు నిరంతరం నిఘా ఉంచాలని విజ్ఞప్తి చేశారు.అంతేకాకుండా, పరిపాలనా సౌలభ్యం మరియు వేగవంతమైన రక్షణ కోసం రాజీవ్ ఇందిరమ్మ కాలనీని యాలల్ పోలీస్ స్టేషన్ పరిధి నుండి తొలగించి, సమీపంలో ఉన్న టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి మార్చాలని ఎస్పీని కోరారు. దీనివల్ల అత్యవసర సమయాల్లో పోలీసులు త్వరితగతిన స్పందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ వినతిపై ఎస్పీ సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Most Popular

Recent Comments