- స్టోన్ టవర్ వైనరీలో ‘తెలంగాణ’ ప్రతినిధుల బృందం అధ్యయనం
- మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ప్రభుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్ రెడ్డి పర్యటన
జనవాహిని ప్రతినిధి తాండూరు: రాష్ట్రంలో పర్యాటక రంగానికి కొత్త ఊపిరి పోసే దిశగా అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, ప్రభుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్ రెడ్డిలు అధ్యయనం వేగవంతం చేశారు. ఇందులో భాగంగా వర్జీనియా రాష్ట్రం లీస్‌బర్గ్‌లోని ప్రసిద్ధ ‘స్టోన్ టవర్ వైనరీ’ని శనివారం వారు సందర్శించారు.వైనరీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులకు ఆత్మీయ స్వాగతం పలికి, ప్రాంగణమంతా తిప్పి చూపించారు. ద్రాక్ష తోటల పెంపకం నుంచి వైన్ తయారీ, బాట్లింగ్, ప్యాకింగ్ వరకు అనుసరిస్తున్న ఆధునిక విధానాలను లోతుగా అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ… సహజ సిద్ధమైన ప్రదేశాలను పర్యాటక కేంద్రాలుగా మలచడంలోనూ, ఎకో-టూరిజం అభివృద్ధిలోనూ అమెరికా విధానాలు ఆదర్శవంతంగా ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో పర్యాటకాభివృద్ధికి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు ఇటువంటి అంతర్జాతీయ అధ్యయనాలు దోహదపడతాయని వ్యాఖ్యానించారు. ఈ పర్యటనలో పలువురు తెలుగు ప్రవాస భారతీయులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
