HomeEntertainmentదుల్కర్ సల్మాన్ ‘ఐయామ్ గేమ్’ ట్రైలర్.. ఎన్టీఆర్ స్పెషల్ ట్వీట్ వైరల్.!

దుల్కర్ సల్మాన్ ‘ఐయామ్ గేమ్’ ట్రైలర్.. ఎన్టీఆర్ స్పెషల్ ట్వీట్ వైరల్.!


దుల్కర్ సల్మాన్ ‘ఐయామ్ గేమ్’ ట్రైలర్.. ఎన్టీఆర్ స్పెషల్ ట్వీట్ వైరల్.!

Jul 30, 2026 6:30PM

వర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నహస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ వేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’ (I’m Game) మూవీ ట్రైలర్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై విడుదలై విశేష ఆదరణ పొందుతోంది. వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్ పై దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్.. ట్రైలర్ ఆద్యంతం మైండ్ బ్లోయింగ్ యాక్షన్, స్పోర్ట్స్ బెట్టింగ్, క్యాసినో నెట్‌వర్క్, పవర్ ఫుల్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఈ ట్రైలర్‌ను చూసిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. “ఐయామ్ గేమ్ ట్రైలర్ లోని ఫైరీ వైబ్ నాకు ఎంతగానో నచ్చింది. ట్రైలర్ ఆద్యంతం చాలా గ్రిప్పింగ్ గా, ఎంగేజింగ్ గా సాగింది. నా సోదరుడు దుల్కర్ సల్మాన్ చేతిలో మరోసారి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఉందనే నమ్మకం నాకుంది. ఈ బెట్ ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ఆశిస్తున్నాను. దుల్కర్, అలాగే మొత్తం టీమ్‌కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అని ఎన్టీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

‘ఐయామ్ గేమ్’ సినిమాలో దుల్కర్ సల్మాన్ ‘డాన్ జాన్’ అనే విభిన్నమైన పాత్రలో నటించారు. గతంలో ‘ఆర్డిఎక్స్’ (RDX) వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన దర్శకుడు నహస్ హిదాయత్ ఈ చిత్రాన్ని వైవిధ్యంగా మలచడం విశేషం. 

కథాంశం విషయానికి వస్తే, క్యాబినెట్ మంత్రుల నుండి మల్టీ మిలియనీర్ల వరకు పాల్గొనే రహస్య గ్యాంబ్లింగ్, క్యాసినో ప్రపంచం, స్పోర్ట్స్ బెట్టింగ్ ఆల్గోరిథమ్స్ చుట్టూ కథ తిరుగుతుంది. క్రికెట్ మ్యాచ్‌లలో ఫస్ట్ బ్యాటింగ్, ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్, ఫైనల్ విన్ వంటి బెట్టింగ్ అంశాలు ఈ ట్రైలర్‌లో ప్రధానంగా కనిపించాయి.

సాంకేతికంగా కూడా ఈ చిత్రం అత్యున్నత ప్రమాణాలతో రూపొందింది. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్లాయి. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ చిత్రం ఆగస్టు 20న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది.

 

Dulquer Salmaan, Im Game Trailer, Jr NTR 





Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Most Popular

Recent Comments