HomeNewsభారత్ పై మరోసారి డొనాల్డ్ ట్రంప్ గుస్సా: ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం- తక్షణమే...

భారత్ పై మరోసారి డొనాల్డ్ ట్రంప్ గుస్సా: ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం- తక్షణమే అమలు

భారత్ పై మరోసారి డొనాల్డ్ ట్రంప్ గుస్సా: ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం- తక్షణమే అమలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కొరడా ఝుళిపించారు. భారత్ సహా దాదాపు 60 దేశాలపై అదనపు టారిఫ్ ను విధించారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం సైతం చేశారు. టారిఫ్ కు సంబంధించిన పూర్తి వివరాలను అమెరికా వాణిజ్య ప్రతినిధుల కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. ఇవి.. తక్షణమే అమలులోకి వచ్చినట్లు ప్రకటించింది. తాజా చర్యతో 10 నుంచి 12.5 శాతం అదనపు భారం పడినట్టయింది.

ఇదివరకు ప్రకటించిన 10 శాతం తాత్కాలిక గ్లోబల్ టారిఫ్‌ల గడువు ముగిసిన నేపథ్యంలో ట్రంప్ తాజా నిర్ణయం తీసుకున్నారు. వీటివల్ల మొత్తం ఇంటర్నేషనల్ ట్రేడింగ్ లో సుమారు 99.4 శాతం వాటా ప్రభావితం కానుంది. బలవంతపు శ్రామిక విధానాల ద్వారా తయారయ్యే వస్తువుల దిగుమతిపై అమెరికాలో దాదాపు శతాబ్ద కాలం నుండి కఠిన నిషేధం అమలులో ఉంటోంది. బలవంతపు శ్రామిక విధానాలకు నిరసనగా ఈ తాజా టారిఫ్ విధించినట్లు యూఎస్ వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్ వెల్లడించారు.

Donald Trump Announces New 10 to 12 5 Percent New Tariffs on India and Other 60 Trading Partners

ఈ నూతన టారిఫ్ లల్లో భారత్ కు మాత్రమే కొంతలో కొంత ఊరట లభించింది. భారత్, యూరోపియన్ యూనియన్, కెనడా వంటి దేశాలపై 10 శాతం టారిఫ్ భారం మాత్రమే పడింది. మిగిలిన వాటిని 12.5 శాతం టారిఫ్ శ్లాబ్ పరిధిలోకి చేర్చారు. వాస్తవానికి భారత్‌పైనా గరిష్టంగా 12.5 శాతం పన్ను విధించాలని తొలుత నిర్ణయించినప్పటికీ.. డొనాల్డ్ ట్రంప్ దీన్ని పునఃసమీక్షించారు. ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు ఫలప్రద కావడం వల్ల వాటి ప్రయోజనాలను దెబ్బతినకుండా ఉండేలా 10 శాతానికి తగ్గించారు.

తిరుమలకు వచ్చే భక్తులకు విజ్ఞప్తి టీటీడీ- తాజా నిర్ణయాలు
తిరుమలకు వచ్చే భక్తులకు విజ్ఞప్తి టీటీడీ- తాజా నిర్ణయాలు

అదే సమయంలో చైనాతో పాటు జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలపై అమెరికా అత్యంత భారీగా టారిఫ్ భారాన్ని మోపింది. అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై గరిష్టంగా 12.5 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రత్యేక పన్నులు వసూలు చేస్తున్నందున స్టీల్, అల్యూమినియం వంటి కొన్ని నిర్దుష్ట పరిశ్రమల ఉత్పత్తులకు మినహాయింపు లభించింది. అమెరికా, మెక్సికో, కెనడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పరిధిలోకి వచ్చే వస్తువులపై కూడా ఈ అదనపు టారిఫ్ భారం పడదు.

ఓ యంగ్ ఇండియన్ గా..: ఢిల్లీ పరిణామాలపై టీమిండియా స్టార్ ఆందోళన: రక్తాన్ని చెమటగా
ఓ యంగ్ ఇండియన్ గా..: ఢిల్లీ పరిణామాలపై టీమిండియా స్టార్ ఆందోళన: రక్తాన్ని చెమటగా

గతంలో ట్రంప్ ప్రభుత్వం విధించిన పలు సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు చట్టవిరుద్ధమంటూ కొట్టివేసింది. ఈ నేపథ్యంలో, భవిష్యత్తులో ఎటువంటి న్యాయపరమైన అడ్డంకులు రాకుండా ఉండేందుకు వీలుగా అధికారులు నెలల తరబడి అధ్యయనం చేసిన తర్వాతే ఈ నూతన విధానాన్ని రూపొందించారు. పరిశ్రమలలో మితిమీరిన ఉత్పత్తి విక్రయాలు సాగిస్తున్న మరో 16 దేశాల ఆర్థిక వ్యవస్థలపై కూడా అమెరికా ప్రస్తుతం ప్రత్యేక విచారణలు జరుపుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments