HomeTelanaganahyderabadరేపు విద్యాసంస్థల బంద్..!

రేపు విద్యాసంస్థల బంద్..!

  • రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయండీ 
  •  ఢిల్లీలో విద్యార్థులపై దాడిని ఖండించిన పి డి ఎస్ యు, ఎన్ ఎస్ యు ఐ  
  • కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

జనవాహిని ప్రతినిధి తాండూరు: ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థి, యువతపై పోలీసులు జరిపిన దాడులను తీవ్రంగా నిరసిస్తూ రేపు శుక్రవారం చేపడుతున్న తెలంగాణ రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని పిడిఎస్ యూ జిల్లా అధ్యక్షుడు పి. శ్రీనివాస్ , ఎన్ ఎస్ యు ఐ తాండూర్ నియోజకవర్గ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం వారు ఓ ప్రకటలనో మాట్లాడుతూ….శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై దౌర్జన్యానికి దిగడం మోదీ ప్రభుత్వ నియంతృత్వ వైఖరికి నిదర్శనమని నాయకులు మండిపడ్డారు. పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ని వెంటనే రద్దు చేయాలని, విద్యార్థులపై జరిగిన దాడి ఘటనపై పారదర్శక విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు.విద్యారంగాన్ని కేంద్రీకరించే కుట్రలను ఉపసంహరించుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే విబిఎస్ఏ బిల్లును తక్షణమే రద్దు చేయాలని నాయకులు స్పష్టం చేశారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం చేపడుతున్న ఈ బంద్‌కు విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థి లోకం, తల్లిదండ్రులు స్వచ్ఛందంగా మద్దతు తెలపాలని వారు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments