- మొక్కలు నాటడం.. భవిష్యత్‌కు పెట్టుబడి
- చెంగోల్‌లో ఇంటింటికీ మొక్కల పంపిణీ
- కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ నర్సమ్మ
జనవాహిని ప్రతినిధి తాండూరు : ఒక్క మొక్క నాటితే భవిష్యత్ తరాలకు ప్రాణవాయువును అందించినట్లేనని చెంగోల్ గ్రామ సర్పంచ్ నర్సమ్మ అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం చెంగోల్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ హరితహారం కార్యక్రమంలో భాగంగా గురువారం ‘ఇంటింటికీ మొక్కల పంపిణీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ సచివాలయం వద్ద సర్పంచ్ నర్సమ్మ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ నేటి తక్షణ అవసరమని తెలిపారు. చెట్లు వాయు కాలుష్యాన్ని నివారించి, సమృద్ధిగా వర్షాలు కురిసేందుకు తోడ్పడతాయని వివరించారు. ప్రతి ఒక్కరూ ఇంటింటికి పంపిణీ చేస్తున్న మొక్కలను నాటి, వాటిని కాపాడుకోవాలని కోరారు. పచ్చని తెలంగాణ నిర్మాణంలో చెంగోల్ గ్రామస్తులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత ప పాల్గొని మొక్కలను అందుకున్నారు.