HomeEntertainmentపాడె మోసిన కౌన్సిలర్...!

పాడె మోసిన కౌన్సిలర్…!

  • ప్రజా సేవకుడు రాధాకృష్ణ అకాల మరణం
  • అంతిమయాత్రలో పాడె మోసిన కౌన్సిలర్ ఇర్షాద్

జనవాహిని ప్రతినిధి తాండూరు: తాండూరు పట్టణం ఎన్టీఆర్ కాలనీకి చెందిన రాధాకృష్ణ గురువారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల కాలనీవాసులు, స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.ఆయన భౌతికకాయానికి నిర్వహించిన అంతిమయాత్రలో 7వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ ఇర్షాద్ పాల్గొని, స్వయంగా రాధాకృష్ణ పాడె మోసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఇర్షాద్ మాట్లాడుతూ… ఎన్టీఆర్ కాలనీలో ప్రజా సేవకూ నిరంతరం శ్రమించిన రాధాకృష్ణ సేవలు మరవరానివని కొనియాడారు. ఆయన మరణం కాలనీకి తీరని లోటని పేర్కొన్నారు.పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ అంతిమయాత్రలో కాలనీ పెద్దలు, నాయకులు మరియు అభిమానులు పాల్గొని అశ్రునయనాల మధ్య తుది వీడ్కోలు పలికారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments