HomeEntertainmentఓటీటీలో రచ్చ.. కుర్రాళ్లకు కిక్కిచ్చే కొరియన్ టాప్-5 డ్రామాలు

ఓటీటీలో రచ్చ.. కుర్రాళ్లకు కిక్కిచ్చే కొరియన్ టాప్-5 డ్రామాలు


ఓటీటీలో రచ్చ.. కుర్రాళ్లకు కిక్కిచ్చే కొరియన్ టాప్-5 డ్రామాలు

యూత్‌లో కొరియన్ డ్రామాల పిచ్చి ఏ స్థాయికి చేరిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ప్రేమ కథలు, నవ్వుల పువ్వులు పూయించే కామెడీతో సాగే రొమాంటిక్ సిరీస్‌లు వీకెండ్స్‌లో బింజ్ వాచ్ చేసేందుకు సరైన ఛాయిస్‌గా నిలుస్తున్నాయి. కుర్రాళ్లకు మంచి కిక్కు ఇచ్చేలా ఓటీటీ వేదికలలో హల్‌చల్ చేస్తున్న టాప్-5 కొరియన్ వెబ్ సిరీస్‌ల జాబితా ఇదిగో!. సరదాగా రిలాక్స్ అవ్వడానికి, మైండ్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఈ 5 కే-డ్రామాలు బెస్ట్ ఆప్షన్!

5. క్రాష్ ల్యాండింగ్ ఆన్ యు

రొమాంటిక్ డ్రామా కేటగిరీకి బెంచ్‌మార్క్‌లా నిలిచే సిరీస్ ఇది. పారాగ్లైడింగ్ చేస్తుండగా అనుకోకుండా ప్రమాదంలో పడి ఉత్తర కొరియా సరిహద్దుల్లో ల్యాండ్ అయిన దక్షిణ కొరియా వ్యాపారవేత్త, ఆమెకు రక్షణగా నిలిచిన ఆర్మీ ఆఫీసర్ మధ్య చిగురించే ప్రేమకథ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఎక్కడ చూడొచ్చంటే: నెట్‌ఫ్లిక్స్

యూట్యూబ్ స్టార్ నాగదుర్గ సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
యూట్యూబ్ స్టార్ నాగదుర్గ సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

Korean Dramas Taking Over OTT 5 Must-Watch Picks for Young Audiences

4. ట్రూ బ్యూటీ

స్కూల్, కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ లవ్ స్టోరీ ఇది. మేకప్‌తో సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని పొందే అమ్మాయి కథతో పాటు ముక్కోణపు ప్రేమాయణం, ఫ్రెండ్‌షిప్ సన్నివేశాలు కుర్రాళ్లకు తెగ నచ్చేస్తాయి. ఎక్కడ చూడొచ్చంటే: అమెజాన్ ప్రైమ్, ఎమ్ఎక్స్ ప్లేయర్

3. బిజినెస్ ప్రపోజల్

యూత్‌కు నచ్చే పక్కా కామెడీ ఫన్ రైడ్ ఇది. స్నేహితురాలి తరఫున ఒక బ్లైండ్ డేట్‌కు వెళ్లిన హీరోయిన్, అక్కడ తన ఓనర్‌నే కలవడం, ఆ తర్వాత జరిగే నాటకీయ పరిణామాలు నాన్-స్టాప్ వినోదాన్ని అందిస్తాయి. ఎక్కడ చూడొచ్చంటే: నెట్‌ఫ్లిక్స్

2. లవ్లీ రన్నర్

టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ ఫాంటసీ రొమాంటిక్ డ్రామా మనసును తేలికపరుస్తుంది. అభిమానించే స్టార్ ప్రాణాలు కాపాడేందుకు కథానాయకి గతంలోకి వెళ్లడం, వారి మధ్య రూపుదిద్దుకునే ప్రేమకథ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎక్కడ చూడొచ్చంటే: నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో

కేంద్రం సంచలన నిర్ణయం.. ఏకంగా 50 ఓటీటీ ఫ్లాట్‌ ఫా‍మ్స్ బ్లాక్
కేంద్రం సంచలన నిర్ణయం.. ఏకంగా 50 ఓటీటీ ఫ్లాట్‌ ఫా‍మ్స్ బ్లాక్

1. క్వీన్ ఆఫ్ టియర్స్

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టాప్ సిరీస్ ఇది. ఒక ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి, సాధారణ నేపథ్యం ఉన్న అబ్బాయి పెళ్లి బంధం చుట్టూ కథ తిరుగుతుంది. బంధాల్లో వచ్చే విబేధాలు, మళ్లీ ఆ ప్రేమను గెలుచుకునే క్రమంలో సాగే ఎమోషన్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. ఎక్కడ చూడొచ్చంటే: నెట్‌ఫ్లిక్స్.



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments