చిన్న సినిమా.. భారీ రేటు.. ‘చెన్నై లవ్ స్టోరీ’ బిజినెస్ లెక్కలివే.!
Jul 14, 2026 3:18PM

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన లేటెస్ట్ మూవీ ‘చెన్నై లవ్ స్టోరీ’తో బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనానికి సిద్ధమవుతున్నాడు. వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న ఈ నటుడు, తాజాగా తన కొత్త సినిమాతో ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచే స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్‌ను నమోదు చేశాడు. ఈ సినిమా జూలై 24న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ ప్రాజెక్ట్ కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా నిలవడం విశేషం.
ఈ సినిమా బిజినెస్ లెక్కలు చూసి, ట్రేడ్ నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఆంధ్రాలో రూ. 8 కోట్లు, సీడెడ్ లో రూ. 3 కోట్లు, నైజాం రూ. 8 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ చిత్రం రూ. 4 కోట్ల బిజినెస్ నమోదు చేసింది. వీటన్నింటినీ కలిపితే ఈ సినిమా థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ. 23 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి.
నాన్-థియేట్రికల్ విషయానికి వస్తే, ‘బేబీ’ సినిమాతో బ్లాక్‌బస్టర్ ఆడియోను అందించిన మేకర్స్ కావడంతో, టీ-సిరీస్ సంస్థ ఈ సినిమా ఆడియో హక్కులను రూ. 5 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక డిజిటల్ రైట్స్ (ఓటీటీ) పరంగా కూడా ఈ సినిమా సాలిడ్ డీల్ సెట్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈ రైట్స్‌ను రూ. 14 కోట్లకు లాక్ చేసింది. హిందీ డబ్బింగ్, శాటిలైట్ రైట్స్ డీల్స్ ఇంకా క్లోజ్ కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమా మొత్తం బిజినెస్ వాల్యూ రూ. 42 కోట్లకు చేరుకుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ సినిమాకి ‘బేబీ’ ఫేమ్ సాయి రాజేష్ కథ అందించగా.. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై SKN, సాయి రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవనుంది.
Kiran Abbavaram, Chennai Love Story, Business