HomeEntertainmentNtr: ఎన్టీఆర్ పై పెద్ద కుట్ర.. ఆ సంస్థపై పోలీసులకి ఫిర్యాదు

Ntr: ఎన్టీఆర్ పై పెద్ద కుట్ర.. ఆ సంస్థపై పోలీసులకి ఫిర్యాదు


Ntr: ఎన్టీఆర్ పై పెద్ద కుట్ర.. ఆ సంస్థపై పోలీసులకి ఫిర్యాదు

Jul 14, 2026 7:02PM

 

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)రాజకీయ రంగప్రవేశంపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, కొన్ని ప్రధాన మీడియా సంస్థలలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలు నందమూరి అభిమానుల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ 100 కోట్ల భారీ బడ్జెట్‌తో పేదలు, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ఒక భారీ సేవా కార్యక్రమాన్ని ప్లాన్ చేశారనే వార్త విపరీతంగా వైరల్ అయింది. దీనికి తోడు, ఈ విషయమై స్పష్టత ఇచ్చేందుకు జూలై 18వ తేదీన తిరుపతిలోని ప్రముఖ తాజ్ హోటల్‌లో ఎన్టీఆర్ స్వయంగా ఒక భారీ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారంటూ కొన్ని సంస్థలు ప్రకటనలు జారీ చేశాయి. ఈ వార్తలు నెట్టింట హల్‌చల్ చేయడంతో అభిమానుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ వార్తలపై ఆయన అధికారిక పీఆర్ టీమ్  స్పందించింది. ఇదంతా కేవలం ఒక పుకారు మాత్రమే.రాజకీయ రంగ ప్రవేశంపై   ఎలాంటి నిజం లేదు. తిరుపతిలో జరగబోయే ప్రెస్ మీట్‌తో కానీ, ‘ఊరు వాడ’ చారిటీ కార్యక్రమాలతో కానీ ఎన్టీఆర్ కి ఎలాంటి సంబంధం లేదు. ఈ ప్రకటనల వెనుక ‘RAW NTR’ (రా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్) అనే ఒక అభిమాన సంస్థ ఉన్నట్లు గుర్తించారు. ఎన్టీఆర్ పేరును వాడుకుంటూ, ఆయనకు ఎలాంటి సమాచారం లేకుండా ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయడంపై ఎన్టీఆర్ అధికారిక వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తారక్ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి. ఈ వ్యవహారంపై స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్ మాట్లాడుతు ‘తిరుపతి వేదికగా ఈ వివాదాన్ని సృష్టించిన ‘RAW ఎన్టీఆర్’ అనే సంస్థపై తిరుపతి జిల్లా ఎస్పీకి అధికారికంగా ఫిర్యాదు చేస్తున్నాం. ఎన్టీఆర్ ఇమేజ్‌ డ్యామేజ్ చేయడానికి దీని వెనుక ఏదో పెద్ద కుట్ర జరుగుతోందని  అనుమానంగా ఉంది.  గత నాలుగు రోజులుగా ఇంత పెద్ద వివాదం నడుస్తున్నా, సదరు సంస్థ ప్రతినిధులు ఎందుకు నోరు విప్పడం లేదు. ఎందుకు సైలెంట్ గా ఉన్నారు. జరుగుతున్న రచ్చను చూసి వాళ్ళు శునకానందం పొందుతున్నారా!

Also read: రిషబ్ శెట్టి vs రానా.. నిజమైతే మాత్రం వాళ్లకి పండగే

తిరుపతి లాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఫేక్ వివాదాలు సృష్టించడం వెనుక ఉన్న అసలు సూత్రధారుల రంగు బయటపడాలి. భవిష్యత్తులో ఇలాంటి ఫేక్ ప్రచారాలు, అనవసర రాజకీయ వివాదాలు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే పోలీసులని ఆశ్రయిస్తున్నాం. అసలు ఎన్టీఆర్‌ను మానసికంగా ఇబ్బంది పెట్టే వాళ్ళు నిజమైన అభిమానులు ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు.

 

 



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments