- ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి వార్డు ప్రజల తరఫున కృతజ్ఞతలు
- తాండూరు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే
- కాగ్నా ప్రాజెక్ట్‌కు రూ. 110 కోట్లు మంజూరు చేయడంపై హర్షం
జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ, ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని 30వ వార్డు కౌన్సిలర్ మెహరాజ్ బేగం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నయీమ్ అఫ్ఫు, యువ నాయకులు అబూబకర్ సిద్ధిఖ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాండూరు మున్సిపాలిటీతో పాటు గ్రామీణ ప్రాంతాల పురోగతిపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని కొనియాడారు.
తాండూరు పట్టణంలో ఏళ్ల తరబడిగా వేధిస్తున్న తీవ్ర తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ఎమ్మెల్యే వేగంగా అడుగులు వేశారని నాయకులు కొనియాడారు. కాగ్నా నది నీటి సరఫరా పథకానికి ఇటీవల రూ. 110 కోట్ల నిధులు మంజూరు కావడం పట్టణ వాసులకు ప్రాణవాయువు లాంటి గొప్ప ఊరటనిచ్చిందని పేర్కొన్నారు.
పట్టణ ప్రజల తాగునీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేసేలా చొరవ చూపిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి వార్డు ప్రజల తరఫున వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
