HomeTelanaganahyderabadమనోహర్ అన్నకు రాఖి కట్టి....!

మనోహర్ అన్నకు రాఖి కట్టి….!

జనవాహిణి డిజిటల్ పత్రిక • READY v9.5 PRO
  • ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి రాఖీ శుభాకాంక్షలు తెలిపిన బిసి నాయకురాలు మధులత
  • వేడుకల్లో సర్ కన్వినర్ కరణం పురుషోత్తం రావు, సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ చారీ 

జనవాహిని ప్రతినిధి తాండూరు; రాఖీ పౌర్ణమి పండగను పురస్కరించుకుని తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి నివాసంలో వేడుకలు కోలాహలంగా జరిగాయి. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పెద్దముల్ మాజీ వైస్ ఎంపీపీ, జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు మధులత శ్రీనివాసచారి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి రక్షాబంధన్ రాఖీ కట్టి మంగళహారతులతో శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి మిఠాయిలు తినిపించి ఆయురారోగ్యాలతో, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం బీసీ సంఘాల నాయకురాలు మధులత మాట్లాడుతూ.. సమాజంలో సోదరభావానికి, రక్షణకు రాఖీ పండుగ ప్రతీక అని, నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటున్న ఎమ్మెల్యేకు రాఖీ కట్టడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గ సర్ ఇన్ఛార్జ్ కర్ణం పురుషోత్తం రావు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.

జనవాహిణి డిజిటల్ పత్రిక • READY v9.5 PRO
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments