Home News ఘనంగా వైఎస్సార్ జయంతి.. రైతు భరోసాపై హర్షం

ఘనంగా వైఎస్సార్ జయంతి.. రైతు భరోసాపై హర్షం

55
0

వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

​- రైతు భరోసా నిధుల విడుదలపై హర్షం

Google search engine

​- సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం

తాండూర్, జూలై 8 (జనవాహిని ప్రతినిధి): తాండూర్ పట్టణంలోని రాజీవ్-ఇందిరమ్మ కాలనీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ సందర్బంగా రైతు ఖాతాల్లో ‘రైతు భరోసా’ పథకం కింద ఎకరాకు రూ. 6,000 పంట పెట్టుబడి సహాయం అందించడం పట్ల నియోజకవర్గ వ్యాప్తంగా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు, రైతులు కలిసి పాలభిషేకం చేశారు. తాండూర్ ప్రాంత రైతుల తరపున ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here