Home News ప్లీజ్ నా లవర్‌ను వదిలేయ్.. పెళ్లికొడుకు ఊళ్లో ప్రియుడి వాల్ పోస్టర్ల రచ్చ!

ప్లీజ్ నా లవర్‌ను వదిలేయ్.. పెళ్లికొడుకు ఊళ్లో ప్రియుడి వాల్ పోస్టర్ల రచ్చ!

7
0

ప్లీజ్ నా లవర్‌ను వదిలేయ్.. పెళ్లికొడుకు ఊళ్లో ప్రియుడి వాల్ పోస్టర్ల రచ్చ!

Google search engine

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని తంగళ్లపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకున్న వింత ప్రేమ వ్యవహారం ప్రస్తుతం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. ఏడేళ్లుగా ప్రాణంగా ప్రేమించుకుంటున్న యువతిని పెద్దలు బలవంతంగా వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి జరిపించేందుకు నిశ్చయించారనే ఆరోపణలతో ఓ ప్రియుడు అర్ధరాత్రి వేలు చేసిన వినూత్న నిరనస ఇప్పుడు రెండు జిల్లాల్లో సంచలనంగా మారింది. తెల్లవారేసరికి ఊరి గోడలపై వెలిసిన వాల్ పోస్టర్లు స్థానికులను ఒక్కసారిగా ఆశ్చర్యంలో ముంచెత్తాయి.

అసలేం జరిగిందంటే..?
సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ యువతి, యువకుడు గత ఏడేళ్లుగా గాఢంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటి కావాలని భావించారు. అయితే వీరి ప్రేమ వ్యవహారం యువతి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. యువతి కుటుంబ సభ్యులు వీరి ప్రేమను అంగీకరించకపోగా.. తంగళ్లపల్లికి చెందిన వేరే యువకుడితే ఆమెకు పెళ్లి చేసేందుకు నిశ్చయించారు. ఈ క్రమంలో పెళ్లికి సంబంధించిన మహూర్తాలు కూడా కుదిర్చి.. పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు.

Thangallapalli Love Protest Lover Pastes Wall Posters at BrideGroom Village to Stop Wedding Details

ఈ నేపథ్యంలో తమ ప్రేమ విషయం అమ్మాయి ఇంట్లో చెప్పినా వినకుండా, ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒప్పించి ఈ పెళ్లి చేస్తున్నారని ప్రియుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కేవలం 16 తులాల బంగారం కోసమే తంగళ్లపల్లికి చెందిన మరో యువకుడు ఆ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నాడంటూ సదరు ప్రియుడు ఆరోపించాడు. ఎలాగైనా తన ప్రేమను కాపాడుకోవాలనే ఉద్దేశంతో.. తాను ఆ అమ్మాయితో దిగిన ఫోటోను, అలాగే పెళ్లి చేసుకోబోయే తంగళ్లపల్లి అబ్బాయి ఫోటోను కలిపి వాల్ పోస్టర్లు సిద్ధం చేశాడు. అందులో వరుడు, అతని తండ్రి పేరు, ఫోన్ నెంబర్లతో సహా పూర్తి వివరాలను ముద్రించాడు.

అర్ధరాత్రి వేళ కారులో తంగళ్లపల్లి ప్రధాన కూడళ్లు, వీధులు, గోడలపై ఈ వాల్ పోస్టర్లను స్వయంగా ఆతికించాడు. ఉదయం నిద్రలేచిన గ్రామస్థులు గోడలపై వెలిసిన ఈ వాల్ పోస్టర్లను చూసి ఒక్కసారిగా షాకయ్యారు. యువకుడు కారులో వచ్చి ఫ్లెక్సీలు అతికిస్తున్న దృశ్యాలన్నీ పరిసరాల్లోని సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ వినూత్న నిరసన ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వినూత్న నిరసన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఇరు కుటుంబాల సభ్యులు అసలేం జరిగిందనే కోణంలో విచారిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here