HomeNewsనీ టీజర్, సినిమా ఏడుంది...?

నీ టీజర్, సినిమా ఏడుంది…?

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • నీ రాజకీయ దుకాణం’ బంద్ చేస్తా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
  • మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రమాణ స్వీకారంలో ఘాటు విమర్శలు

జ నవాహిని ప్రతినిధి తాండూరు : మున్సిపల్ చైర్‌పర్సన్ పదవీ స్వీకార కార్యక్రమం రాజకీయ రణరంగాన్ని తలపించింది. అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ప్రత్యర్థులపై స్థానిక ఎమ్మెల్యే నిప్పులు చెరిగారు. అభివృద్ధి చేసే చిత్తశుద్ధి లేని వ్యక్తులకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రత్యర్థులపై నేరుగా విమర్శలు చేస్తూ.. “బిడ్డ.. నీ టీజర్ చూశాం, సినిమా ఎక్కడుంది? అసలు సినిమా ముందుంది చూడు” అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన సొంత మండలానికే కనీసం రోడ్డు సౌకర్యం కల్పించుకోలేని వ్యక్తి, ఇక నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నప్పుడు కూడా అభివృద్ధిని విస్మరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజకీయాలను వ్యాపారంగా మార్చిన వారి “దుకాణం” త్వరలోనే బంద్ చేసి చూపిస్తానని ఎమ్మెల్యే సవాల్ విసిరారు.     జూనియర్ కాలేజ్ నిర్మించే సోయి లేదు కానీ సినిమా చూపిస్తా అంటూ మతాలు మాట్లాడుతున్న సన్యాసి అంటూ తీవ్రంగా అగ్రహించారు. “వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటేనే భయం పుట్టేలా చేస్తాం. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు అని స్పష్టం చేశారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, రాబోయే రోజుల్లో తన యాక్షన్ ఎలా ఉంటుందో చూపిస్తానని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు అభివృద్ధి చేయ్యకుండా కరోనా వచ్చిందని చెప్పడం…. సిగ్గుచేటు అన్నారు. ని సొంత పనులకు అడ్డురని కరోనా తాండూరు ప్రజల అవసరాలు తీర్చేందుకు వచ్చిందా అంటూ ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మరో సారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు భయపడాలని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments