‘జానకి చెంతనే రాముడి హృదయం..’ సందీప్ రెడ్డి వంగా సరికొత్త ‘రోమాంచకం’.!
Jul 6, 2026 8:48PM
టాలీవుడ్‌లో సంచలన దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న సందీప్ రెడ్డి వంగా సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. కల్ట్ అండ్ బోల్డ్ కంటెంట్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసే ఆయన, ఈసారి ఒక అందమైన యూత్ ఫుల్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సరికొత్త చిత్రం ‘రోమాంచకం’. ‘మేమ్ ఫేమస్’ సినిమాతో తనదైన నటనతో మరియు యూట్యూబ్ కంటెంట్‌తో తెలుగు యువతకు ఎంతగానో దగ్గరైన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుమంత్ ప్రభాస్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. అలాగే టాలెంటెడ్ బ్యూటీ అనంతిక శాసిల్‌కుమార్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ‘ప్రేమ, హాస్యం, ఉత్కంఠ’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ గ్లింప్స్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ లవ్, కామెడీ, రొమాంటిక్ ఎలిమెంట్స్‌తో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
తాజాగా విడుదలైన ఈ రోమాంచకం గ్లింప్స్ స్టార్టింగ్‌లో వచ్చే ఒక అందమైన కవిత ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేస్తోంది. “జానకి చెంతనే రాముడి హృదయం.. ఈ ప్రేమ కావ్యం మృదుమధురం” అంటూ సాగిన ఈ వాయిస్ ఓవర్ విజువల్స్ కి ఒక అద్భుతమైన ఫీల్ తీసుకొచ్చింది. ఈ గ్లింప్స్‌లో సుమంత్ ప్రభాస్, అనంతిక మధ్య కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్‌లో వర్కవుట్ అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వారి మధ్య వచ్చే కొన్ని క్యూట్ అండ్ రొమాంటిక్ సీన్స్‌తో పాటు, యూత్‌ను ఆకట్టుకునే మార్కు కామెడీ డైలాగ్స్, సరదా నవ్వులు ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేస్తున్నాయి. ఒక అందమైన ప్రేమకథగా మొదలై, వారిద్దరి మధ్య ఏర్పడిన దూరాన్ని ఎంతో ఎమోషనల్‌గా చూపిస్తూ ఈ గ్లింప్స్ సాగింది. అంతేకాకుండా, “అణువు అణువును ఉర్రూతలూపే ప్రణయ కల్లోలమే రోమాంచకం, ఊహకే అందని ఉవ్వెత్తునెగిసే ఉత్తుంగ తరంగమే రోమాంచకం..” అంటూ గ్లింప్స్ చివర్లో వినిపించే లిరిక్స్ ఈ మూవీ ఎంత వైబ్రేటింగ్‌గా, ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతుందో ముందే హింట్ ఇస్తున్నాయి.
యువతను మెప్పించే అంశాలన్నింటినీ జోడించి ఒక పక్కా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి ఈ చిత్రాన్ని మలిచారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా సిద్ధమవుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్‌ను కూడా చిత్ర యూనిట్ అధికారికంగా లాక్ చేసింది. రాబోయే సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తున్న సినిమా కావడంతో ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ చిత్రంపై భారీ బిజినెస్ అంచనాలు నెలకొన్నాయి.
Romanchakam, Sumanth Prabhas, Sandeep Reddy Vanga, Ananthika Sanilkumar,






