ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసుండరు.. చివరి వరకూ నరాలు తెగే ఉత్కంఠ..!
కొన్ని సినిమాలు నవ్విస్తాయి.. కొన్ని సినిమాలు ఏడిపిస్తాయి.. కొన్ని సినిమాలు చూస్తే ఫుల్ టైమ్ పాస్ అవుతుంది. కానీ చాలా తక్కువ సినిమాలు మాత్రమే మనల్ని వెంటాడుతాయి. అలాంటి అతి కొద్ది సినిమాల్లో ఈ మూవీ కూడా ఒకటి. నెట్ ఫ్లిక్స్ లో అత్యంత ప్రజాదరణ పొందిన మిస్టరీ ఫ్రాంచైజ్ ‘ఎనోలా హోమ్స్ 3’ ప్రస్తుతం భారత ఓటీటీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సరికొత్త చిత్రం విడుదలైన కేవలం 24 గంటల్లోనే నెట్ ఫ్లిక్స్ ఇండియా టాప్ 10 జాబితాలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఉత్కంఠభరితమైన పరిశోధనలు, కుటుంబ భావోద్వేగాలు, గూఢచర్య మలుపులతో సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది.
సుమారు ఒక గంటా 48 నిమిషాల నిడివితో సాగే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 జూలై 1న స్ట్రీమింగ్ అయింది. మిస్టరీ, అడ్వెంచర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుల నుంచి లభిస్తున్న సానుకూల స్పందనతో, ఇది త్వరలోనే నెట్ ఫ్లిక్స్ ఇండియాలో మొదటి స్థానానికి చేరుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. గత విజయవంతమైన భాగాల కంటే ఈ మూడో భాగంలో ఉత్కంఠ మరింత పెరిగింది.
ట్విస్టులతో సాగే కొత్త కథ..
ఎనోలా హోమ్స్ రెండో భాగం ముగిసిన చోట నుంచే ఈ కొత్త కథ ప్రారంభమవుతుంది. ఎనోలా (మిల్లీ బాబీ బ్రౌన్) తన ప్రియుడు లార్డ్ ట్యూక్స్‌బరీ (లూయిస్ పాట్రిడ్జ్)ని వివాహం చేసుకునేందుకు మాల్టాకు వెళుతుంది. అయితే వివాహ ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే ఆమె సోదరుడు, ప్రసిద్ధ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ (హెన్రీ కావిల్) అకస్మాత్తుగా అదృశ్యమవుతాడు. అదే సమయంలో కాబోయే అత్త లేడీ ట్యూక్స్‌బరీ కిడ్నాప్ కు గురికావడం, ఆ వెంటనే రెండు అనుమానాస్పద హత్యలు జరగడం కథను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తాయి. దీంతో ఎనోలా తన వివాహాన్ని పక్కనబెట్టి, ఈ నేరాల వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకోవడానికి రంగంలోకి దిగుతుంది. కుటుంబ బంధాలు, రహస్య కుట్రలతో సాగే ఈ ప్రయాణం ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తుంది.
ఈ చిత్రంలో మిల్లీ బాబీ బ్రౌన్ తన అద్భుతమైన నటనతో మెప్పించగా, హెన్రీ కావిల్, లూయిస్ పాట్రిడ్జ్ కీలక పాత్రల్లో అలరించారు. డాక్టర్ వాట్సన్‌గా హిమేష్ పటేల్, హెలెనా బోన్హామ్ కార్టర్ వంటి ప్రముఖ తారాగణంతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక చక్కని సస్పెన్స్ డ్రామాను పరిచయం చేసింది. పాత పాత్రలతో పాటు కొత్త పాత్రల ప్రవేశం కథకు మరింత నిండుదనాన్ని ఇచ్చింది.

భారతీయ ఓటీటీ రంగంలో ప్రస్తుతం ‘ఎనోలా హోమ్స్ 3’ సాధిస్తున్న ఆదరణ చూస్తుంటే, గ్లోబల్ కంటెంట్‌కు ఇక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని స్పష్టమవుతోంది. విభిన్నమైన మలుపులు, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ స్పై థ్రిల్లర్ రాబోయే రోజుల్లో మరిన్ని సరికొత్త వ్యూవర్ షిప్ రికార్డులను సృష్టించే దిశగా దూసుకుపోతోంది.







