HomeNewsవిజయ విద్యాలయంలో తెలంగాణ సంబరాలు..!

విజయ విద్యాలయంలో తెలంగాణ సంబరాలు..!

spot_img
JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
  • విజయ విద్యాలయంలో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు
  •  మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన టీపీసీసీ ప్రచార కోఆర్డినేటర్ కరణం పురుషోత్తం రావు
  •  అమరవీరుల త్యాగాలను స్మరించుకున్న కమిటీ సభ్యులు

జనవాహిని ప్రతినిధి తాండూరు : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తాండూరు పట్టణంలోని విజయ విద్యాలయ ఉన్నత పాఠశాల లో మంగళవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీపీసీసీ ప్రచార కోఆర్డినేటర్, పాఠశాల కరస్పాండెంట్ కరణం పురుషోత్తం రావు ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరుల బలిదానాలు ఎన్నటికీ మరువలేనివని కొనియాడారు. వారి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం మరింత వేగంగా ప్రగతి పథంలో దూసుకుపోవాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు సత్యనారాయణ బూబ్, పాఠశాల మేనేజ్‌మెంట్ కార్యదర్శి బీదర్ రాజశేఖర్, హెడ్ మాస్టర్ శరత్ కళ, ఉపాధ్యాయులు చెన్ వీరయ్య, మల్ రెడ్డి, పాఠశాల సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments