HomeEntertainmentతీవ్రంగా కొట్టి, సిగరెట్లతో కాల్చి చిత్రహింసలు.. ఎట్టకేలకు ఓపెన్ అయిన హీరోయిన్

తీవ్రంగా కొట్టి, సిగరెట్లతో కాల్చి చిత్రహింసలు.. ఎట్టకేలకు ఓపెన్ అయిన హీరోయిన్

జనవాహిణి డిజిటల్ పత్రిక EPAPER CLIP STUDIO • READY


తీవ్రంగా కొట్టి, సిగరెట్లతో కాల్చి చిత్రహింసలు.. ఎట్టకేలకు ఓపెన్ అయిన హీరోయిన్

ప్రముఖ టెలివిజన్ నటి నీతి టేలర్ తన గతాన్ని గుర్తుచేసుకుంటూ సంచలన విషయాలను బయటపెట్టారు. గతంలో తాను ఒక విషపూరితమైన బంధంలో ఉన్నానని, ఆ సమయంలో శారీరకంగా, మానసికంగా గృహ హింసను ఎదుర్కొన్నానని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైమ్ వీడియో వేదికగా ప్రసారం అవుతున్న కొత్త రియాలిటీ షో ‘అలయన్స్’లో పాల్గొన్న సందర్భంగా తన జీవితంలోని ఈ అత్యంత భయంకరమైన కోణాన్ని మొదటిసారి చెప్పారు.

ఈ షోలో తోటి నటీమణులు, సెలబ్రిటీలతో మాట్లాడుతున్న సమయంలో నీతి తన శరీరంలో ఉన్న ఒక పాత గాయాన్ని చూపించారు. ఒకప్పుడు తన ప్రియుడు అత్యంత హింసాత్మకంగా ప్రవర్తించేవాడని, మానసిక వికృతాన్ని చూపేవాడని గుర్తుచేసుకున్నారు. ఒకరోజు రాత్రి అతడి పుట్టినరోజు వేడుకల సమయంలో తీవ్రమైన కోపంతో తనను గట్టిగా చెంపదెబ్బ కొట్టాడని, ఆ క్షణంలోనే ఇక చాలు అనుకుని ఆ నరకప్రాయమైన బంధానికి స్వస్తి చెప్పినట్లు తెలిపారు. వెంటనే ‘గుడ్‌ బై, మళ్లీ కలుద్దాం’ అంటూ అక్కడే ఆ బంధాన్ని తెంచుకుని వచ్చేసినట్లు నటి వివరించారు.

ఆ సమయంలో తాను వయసులో చాలా చిన్నదాన్ని అని, అమాయకత్వం వల్ల ఎదుటివారి నైజాన్ని, వారిలోని ప్రమాదకరమైన ప్రవర్తనను సరిగ్గా గుర్తించలేకపోయానని నీతి పేర్కొన్నారు. పరిణతి లేకపోవడం వల్ల ఆ విషపూరితమైన బంధంలో కొన్నాళ్లు భరించాల్సి వచ్చిందని, కానీ హద్దులు దాటిన రోజున ధైర్యంగా ముందడుగు వేశానని చెప్పారు. ఈ భయంకరమైన శారీరక గాయం, ఆ చేదు అనుభవం నుంచి తాను మానసికంగా కోలుకోవడానికి చాలా కాలం పట్టిందని ఆమె వెల్లడించారు.

వైవాహిక జీవితం.. విడాకుల ప్రచారంపై క్లారిటీ

ఈ రియాలిటీ షో వేదికగా నీతి కేవలం తన గతాన్నే కాకుండా, ప్రస్తుత వైవాహిక జీవితంపై వస్తున్న పుకార్లపైనా కూడా క్లారిటీ ఇచ్చారు. ఆర్మీ ఆఫీసర్ పరక్షిత్ బావాతో నీతి టేలర్ వివాహం 2020 ఆగస్టు 13న వైభవంగా జరిగింది. అయితే 2024 లో వీరిద్దరూ విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. ఆ ప్రచారం గురించి అప్పట్లో ఎలాంటి వివరణ ఇవ్వకుండా సైలెంట్‌గా ఉండటంపై నటి ఇప్పుడు స్పందించారు.

NitiTaylor TV Actress Makes Shocking Revelations on Reality Show Boyfriend Burned Me With Cigarettes

తాజా ఇంటర్వ్యూలో ఆ మౌనం వెనుక ఉన్న అసలు కారణాన్ని నటి వెల్లడించారు. రూమర్లకు స్పందించకపోవడమే ఒక బలమైన సమాధానమని చెప్పారు. మన జీవితంలో అసలు ఏమీ జరగనప్పుడు అందరికీ అనవసరంగా వివరణలు ఇస్తూ కాలం వృథా చేసుకోవాల్సిన అవసరం లేదని నీతి టేలర్ తేల్చి చెప్పారు. ఈ విధంగా తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఎన్నో ఒడిదొడుకులను అధిగమిస్తూ, ప్రస్తుతం ధైర్యంగా ముందుకు సాగుతున్న నటి ప్రయాణం పలువురికి స్ఫూర్తినిస్తోంది.



Source link

జనవాహిణి డిజిటల్ పత్రిక EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments